నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 వేదికగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ‘ఏఐ-ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా’ ఆవిష్కరణ


భారత ప్రయోజనాధారిత ఏఐ వ్యవస్థను ఆవిష్కరించిన పుస్తకం

ఏఐ భవితను రూపొందిస్తున్న భారత ఆవిష్కర్తలకు సముచిత గుర్తింపు

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 3:39PM by PIB Hyderabad

బాధ్యతాయుతమైనసమ్మిళిత కృత్రిమ మేధస్సులో ప్రపంచంలోనే అగ్రగామిగా పురోగమిస్తున్న భారత్ స్థానాన్ని పునరుద్ఘాటిస్తూ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈ రోజు ఏఐ-ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అనే కీలక కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించిందిఇది వాస్తవ ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను రూపొందించే 45 మార్గదర్శక ఏఐ అంకురసంస్థల ప్రయాణాలను వివరిస్తుంది.

భారత డీప్-టెక్ఏఐ అంకురసంస్థల వ్యవస్థ నిర్మాణంలో ఏఐఎమ్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ... న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఏఐఎమ్ ఇన్నోవేషన్స్ ఫర్ యు కాఫీ టేబుల్ సిరీస్ 7వ సంచికగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఏఐ-ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియాలో ఆరోగ్య సంరక్షణవిద్యసుస్థిరతరవాణాక్రీడా విశ్లేషణలుడీప్ టెక్సామాజిక ప్రభావం వంటి 30కి పైగా రంగాల్లో పనిచేసే అంకురసంస్థల వివరాలు ఉన్నాయిఅటల్ ఇంక్యుబేషన్ సెంటర్ల (ఏఐసీలదేశవ్యాప్త నెట్‌వర్క్ ద్వారా రూపొందించిన ఈ పుస్తకం... సాంప్రదాయ సాంకేతిక కేంద్రాలకు మించి విస్తరించిన భారత ఏఐ ఆవిష్కరణ కేంద్రాల భౌగోళికవిషయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా మాట్లాడుతూ:

"గౌరవనీయ ప్రధానమంత్రి నిరంతరం కృత్రిమ మేధస్సు కోసం స్పష్టమైన దార్శనికతను వ్యక్తపరుస్తూనే ఉన్నారుఇది సమ్మిళిత వృద్ధివిలువలతో కూడిన విస్తరణసామాజిక శ్రేయస్సు కోసం ఏఐ వంటి అంశాలతో ముడిపడి ఉందిఏఐ-ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆ దార్శనికతకు ప్రతిబింబంఈ పుస్తకంలో కనిపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కేవలం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను నిర్మించడం మాత్రమే కాదు... వారు భారత వాస్తవికతలలో ముడిపడినజాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్న ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారుఈ పుస్తకం ప్రయోజనాధారిత ఆవిష్కరణల ద్వారా ప్రపంచస్థాయిలో ఏఐ చర్చను నడిపించే దిశగా భారత్ మార్గాన్ని ప్రదర్శిస్తుందిఈ గొప్ప సందర్భంలో ఈ పుస్తకం ద్వారా ఏఐఎమ్ తగినంత గుర్తింపు లభించని ఎందరో ఆవిష్కర్తలకు సముచిత గుర్తింపు లభించేలా చేస్తుంది,"

సీనియర్ విధాన నిర్ణేతలుఈ రంగంలోని దిగ్గజాలను ఈ ఆవిష్కరణ ప్యానెల్ ఒకచోట చేర్చిందివీరిలో హర్యానా ప్రభుత్వ భవిష్యత్ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమ్నీత్ పి కుమార్ఐఏఎస్... ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఎస్ఈటీయూ ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ రాజశేఖర్ జోషి... బీఐఆర్ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేంద్ర కుమార్... ఎస్‌టీపీఐ డైరెక్టర్ జనరల్ శ్రీ అరవింద్ కుమార్... భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి శ్రీ రాఘవ్ చంద్రఐఏఎస్‌లు ఉన్నారు.

ఈ సంచికలో ప్రత్యేకంగా దాని వ్యవస్థాపకుల గురించిన కథను చెప్పే విధానాన్నిసాంకేతిక పురోగతులను మాత్రమే కాకుండా డీప్-టెక్ రంగంలో పరిజ్ఞానాన్ని అన్వేషించే వ్యవస్థాపకుల ప్రేరణలుసవాళ్లుపట్టుదలనూ వివరించారుఏఐ ఆవిష్కరణల వెనక గల యాంత్రిక అంశాల కంటే మానవీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఈ పుస్తకం లాభార్జన ధ్యేయంగా సాగే కథనాల నుంచి ప్రయోజనాధారిత వ్యవస్థాపకత దిశగా వచ్చిన పరివర్తనను స్పష్టం చేసింది.

ప్రపంచ విధానాల్లోఆర్థిక సంభాషణల్లో కృత్రిమ మేధస్సు ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో విడుదలైన ఏఐ-ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా పుస్తకం... భారత్‌ను సరిహద్దు సాంకేతిక పరిజ్ఞానాల వినియోగదారుగా మాత్రమే కాకుండాబాధ్యతాయుతమైన ఏఐ మార్గాలను రూపొందించడంలో ప్రపంచానికి తోడ్పాటునందించే శక్తిగా ప్రస్తావించిందిప్రజా ఆవిష్కరణ మౌలిక సదుపాయాలునిరంతర ఇంక్యుబేషన్ మద్దతుమిషన్-ఆధారిత పాలన భారతీయ అంకురసంస్థలు ప్రపంచస్థాయిలో సులభంగా విస్తరించదగిన ప్రభావాన్ని కలిగించడానికి వీలు కల్పిస్తున్న తీరును ఈ పుస్తకం ప్రదర్శిస్తుందిఈ పుస్తకం ఇక్కడ అందుబాటులో ఉంటుందిhttps://aim.gov.in/resources.php

 

***


(రిలీజ్ ఐడి: 2229328) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Malayalam