సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026 లోని వేవ్స్ క్రియేటర్స్ కార్నర్‌లో


కృత్రిమ మేధ సంబంధిత నవకల్పనల్ని ప్రదర్శించనున్న 51 అంకుర సంస్థలు

భారత నవ తరం మీడియా టెక్ నూతన ఆవిష్కర్తల ప్రతిభకు వేదికను అందించిన వేవ్స్ క్రియేటర్స్ కార్నర్

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 4:21PM by PIB Hyderabad

భారత్‌లో శరవేగంతో దూసుకుపోతున్న ప్రసార మాధ్యమాలువినోద రంగ సంబంధిత వినూత్న అనుబంధ విస్తారిత వ్యవస్థకు అనువైన వేదిక అందుబాటులోకి వచ్చిందిఏవీజీసీ-ఎక్స్‌ఆర్ (యానిమేషన్విజువల్ ఎఫెక్ట్‌స్గేమింగ్కామిక్స్ఎక్స్‌టెండెడ్ రియాలిటీ)తో పాటు మీడియా టెక్ రంగంలోని 51 ప్రతిభాన్విత అంకుర సంస్థలు తమ ఉత్పాదనలనీసాంకేతికతలనీ ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026 లోని వేవ్స్ క్రియేటర్స్ కార్నర్‌లో ప్రదర్శించబోతున్నాయిఈ వేవ్స్ క్రియేటర్స్ కార్నర్‌కు కేంద్ర సమాచారప్రసార శాఖ సారధ్యం వహిస్తోందిన్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026 ఫిబ్రవరి 16న మొదలైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోను ఫిబ్రవరి 20 వరకూ నిర్వహించనున్నారు.

భారత్‌లో నూతన ఆవిష్కరణలకు ఆలంబనగా ఉన్న సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థను వేవ్ఎక్స్ బలోపేతం చేస్తోందిఈ క్రమంలోనేపైన ప్రస్తావించిన అంకుర సంస్థలకు వేవ్ఎక్స్ మద్దతునిచ్చిఎక్స్‌పోలో పాలుపంచుకొనేందుకు మార్గాన్ని సుగమం చేసిందివేవ్స్ క్రియేటర్స్ కార్నర్ ఒక చైతన్య వేదిక.. దీనిని కృత్రిమ మేధస్సు (ఏఐఆధారిత సేవలనీశ్రోతలు లీనమైపోయేలా కథల్ని చెప్పే సంవిధానాలనీగేమింగ్‌లో నూతన ఆవిష్కరణల్నీవర్చువల్ ప్రొడక్షన్ టూల్స్‌నీఅతి వినూత్న కంటెంట్ సాంకేతికతలనీ పరిశ్రమ రంగ ప్రముఖులకీపెట్టుబడిదారులకీవిధాన రూపకర్తల తో పాటుఈ రంగమంటే ఆసక్తిని కనబరుస్తున్న వివిధ దేశాల వర్గాల కళ్లెదుట నిలిపేందుకు అంకుర సంస్థలకు ఒక చక్కని వేదికగా ఈ కార్నర్ ఉపయోగపడనుంది.

ఎంపిక చేసిన ఈ అంకుర సంస్థలు భారత్‌లో శరవేగంగా ఎదుగుతున్న ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ రంగంలోని వివిధ అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయిఏఐ ఆధారిత యానిమేషన్ పైప్ లైన్లురియల్-టైమ్ రెండరింగ్ ఇంజిన్ల మొదలు ఆకర్షణీయ ఎక్స్‌ఆర్ అనుభూతులూగేమిఫైడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారాల వరకూప్రదర్శనకు నడుం బిగించిన అంకుర సంస్థలు కంటెంట్ సృజననీపంపిణీనీప్రేక్షకవర్గాలతో అనుబంధాన్నీ పునర్ నిర్వచించడంలో కృత్రిమ మేధకున్న పరివర్తన ప్రధాన సామర్థ్యానికి అద్దం పట్టనున్నాయి.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో వేవ్స్ క్రియేటర్స్ కార్నర్ వినూత్న ఉపాయాలను ‘‘ఐడియాస్ ఫర్ ఇండియా ఏఐ’’ వేదికపై ఆవిష్కరించనుందిప్రసార మాధ్యమాల నవకల్పనలతో సందర్శకులు మమేకం అయ్యేందుకు ‘‘ఐడియాస్ ఫర్ ఇండియా ఏఐ’’ వేదిక అవకాశాలను అందిస్తుందిఇక అంకుర సంస్థలూటెక్ డెవలపర్లూ కలిసి ‘‘జీరో-టచ్ అటానమస్ న్యూస్‌రూమ్’’ను నిర్వహిస్తున్నారుఇది ఇదివరకు ఎరుగని ఒక అపూర్వ వ్యవస్థ అని చెప్పాలిఇది తాజా సంఘటనల ప్రసారాల్ని మానవ ప్రమేయం లేకుండానే హిందీఇంగ్లిషుతమిళ భాషల్లోకి మార్చి ‘‘తాజా వార్తల’’ బులిటెన్లుగా వినిపిస్తుందిఇదే కార్నర్‌లో మరో ఆకర్షణగా ‘‘ది భాషా వాల్’’ నిలుస్తోందిఇది ఒక విస్తృత వీడియో గ్రిడ్ఇది ఏఐ సాంకేతిక భాషా అవతారంతో ఎనిమిది భారతీయ భాషల్లో వాస్తవ సమయంలో లిప్సింక్ డబ్బింగును ప్రదర్శిస్తుంది.

సందర్శకులలో ఇంటరాక్టివ్ అనుభూతులను పొందాలనుకొనే వారు ‘‘సంవాద్ సేతు’’లోకి ప్రవేశించి లబ్ధప్రతిష్ఠులతో మాట్లాడవచ్చు. ‘‘డైరెక్టర్స్ చైర్’’ నుంచి ఆదేశాలిస్తూచలనచిత్ర దృశ్యాల్లో మార్పు చేర్పులు చేయొచ్చుఇవి కాకపోతే, ‘‘స్వర్ సంగమ్’’ సాయంతో కొన్ని క్షణాల వ్యవధిలో ప్రసార యోగ్యత కలిగిన గీతాలను రచించవచ్చునుఇతర ముఖ్య ఆకర్షణల్లో.. వాస్తవ కాల ప్రాతిపదికన వివిధ భాషల్లో ముఖాముఖిని నిర్వహించడానికి వీలు కల్పించే ఏఐ ఆధారిత పాడ్‌కాస్ట్ స్టుడియోకబురులాడే ఏఐ హ్యూమనాయిడ్ రోబోస్వరాన్ని అనుకరించే కేంద్రం వంటివి ఉన్నాయివాయిస్ క్లోనింగ్ స్టేషన్‌లోకి అడుగు పెట్టే వారు వివిధ భారతీయ భాషల్లో తాము గడగడా మాట్లాడటాన్ని స్వయంగా వినవచ్చును.

దీనికి అదనంగాభాషాసేతుకళాసేతు చాలెంజుల్లో విజేతలుగా నిలిచిన అంకుర సంస్థలు కూడా ఎక్స్‌పోలో పాల్గొనివాటి ఉత్పాదనలను ప్రదర్శిస్తాయిఈ చాలెంజుల్లో భాషా సాంకేతికతలలో వినూత్న సేవలతో పాటు సాంస్కృతిక-సాంకేతికత ప్రధాన సేవలను ఆవిష్కరించిన అంకుర సంస్థలను విజేతలుగా గుర్తించారుఈ సంస్థలు కృత్రిమ మేధ ఆధారిత ఉపకరణాలను ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నాయిఈ ఉపకరణాలు భాషాపరమైన సౌలభ్యాన్ని పెంచుతూసాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు భారతీయ సృజనాత్మక కంటెంటును అనేక దేశాల వారి చెంతకు చేరవేస్తాయి.

వేవ్‌ఎక్స్‌‌ను గురించి

సమాచారప్రసార శాఖ నిర్వహిస్తున్న వేవ్స్ కార్యక్రమంలో వేవ్ఎక్స్ ఓ భాగంఅంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించడం దీని ప్రధానోద్దేశంప్రసార మాధ్యమాలువినోదంభాషా సాంకేతికత సంబంధి అనుబంధ విస్తారిత వ్యవస్థ.. ఈ మూడింటిలో నవకల్పనను పెంపొందించడంపైన వేవ్స్ దృష్టిని కేంద్రీకరిస్తోందిభారత నవ తరపు సృజనశీలసాంకేతికత ప్రధాన అంకుర సంస్థలకు వెన్నుదన్నుగా నిలవడానికే వేవ్ఎక్స్‌ను ప్రారంభించారుఇది నూతన ఆవిష్కర్తలుప్రభుత్వ సంస్థలుపరిశ్రమ ప్రముఖులకు మధ్య ఒక వారధిగా నిలుస్తోందిహ్యాకథాన్లుప్రధానంగా ప్రోత్సాహాన్ని అందించేందుకే నిర్వహించే కార్యక్రమాలుమార్గదర్శకత్వంజాతీయ వేదికలతో ఏకీకరణ సదుపాయం.. ఈ మార్గాలలో వేవ్‌ఎక్స్ విభిన్న ఆలోచనలను సమర్ధిస్తుందిఅండదండలందించే అనుబంధ విస్తారిత వ్యవస్థ పక్కాగానూనిరంతరాయంగానూ వర్ధిల్లేలా చూడటానికి హైదరాబాద్‌లోని టి-హబ్‌తోనూఢిల్లీలోని ఐఐటీతోనూ భాగస్వామ్యాన్ని వేవ్ఎక్స్ నెలకొల్పుకొనిదేశవ్యాప్తంగా తొమ్మిది ఇన్‌క్యూబేషన్ కేంద్రాల్ని నిర్వహిస్తోందిఈ తొమ్మిది కేంద్రాల్నీ ఐఐసీటీముంబయిఎఫ్‌టీఐఐపుణేఎస్ఆర్ఎఫ్‌టీఐకోల్‌కతాఐఐఎంసీఢిల్లీఐఐఎంసీఐజ్వాల్‌ఐఐఎంసీఅమరావతిఐఐఎంసీడెంకనల్ఐఐఎంసీకోటయంఐఐఎంసీజమ్మూలలో ఏర్పాటు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2228936) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada , Malayalam