ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌ను ఫిబ్రవరి 17న కలుసుకోనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించనున్న ఇద్దరు నేతలు..

ప్రాంతీయంగానూ, ప్రపంచ స్థాయిలోనూ ప్రాధాన్యం కలిగిన అంశాలపై అభిప్రాయాలను పంచుకోనున్న శ్రీ మేక్రోన్, శ్రీ మోదీ

‘భారత్-ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరం-2026’ను ప్రారంభించనున్న ప్రధాని శ్రీ మోదీ, అధ్యక్షుడు శ్రీ మేక్రోన్

प्रविष्टि तिथि: 16 FEB 2026 9:02AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 17న ముంబయికి వెళ్లనున్నారుఅక్కడ ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌‌తో సమావేశమవుతారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌‌ అందుకొని, 2026 ఫిబ్రవరి 17వ తేదీ మొదలు 19వ తేదీ వరకూ భారత్‌లో అధికారిక పర్యటనకు వస్తున్నారుఆయన భారత్‌లో జరుగుతున్న ‘కృత్రిమ మేధ ప్రభావ శిఖరాగ్ర సదస్సు’లో పాల్గొంటారుముంబయిలో ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సులోనూ పాలుపంచుకోనున్నారుఅధ్యక్షుడు శ్రీ మేక్రోన్‌ భారత్‌కు రావడం ఇది నాలుగో సారిముంబయిలో ఆయన పర్యటించనుండడం ఇది మొదటి సారి.

ఫిబ్రవరి 17న మధ్యాహ్నం దాదాపు 3:15 గంటలకుఇద్దరు నేతలూ ముంబయిలోని లోక్ భవన్‌లో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారుభారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో చోటుచేసుకున్న పురోగతిని ఈ సమావేశాలలో వారు సమీక్షిస్తారువ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృఢతరం చేసుకోవడానికీదీంతో పాటు సరికొత్త రంగాల్లోకి విస్తరించడానికి గల అవకాశాలపై వారు తమ చర్చలలో శ్రద్ధ తీసుకొంటారుప్రాంతీయంగానూప్రపంచ స్థాయిలోనూ ప్రాధాన్యం కలిగిన అంశాలపై ప్రధానమంత్రి శ్రీ మోదీఅధ్యక్షుడు శ్రీ మేక్రోన్ అభిప్రాయాల్ని పంచుకుంటారు.

సాయంత్రం సుమారు 5:15 గంటలకునేతలిద్దరూ ‘భారత్-ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరం-2026’ను ప్రారంభిస్తారురెండు దేశాలకూ చెందిన వాణిజ్య రంగ ప్రముఖులుఅంకుర సంస్థలుపరిశోధకులతో పాటు నూతన ఆవిష్కర్తలతో ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2228671) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Tamil , Assamese , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Gujarati , Kannada , Malayalam