ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైద్య విద్యపై తాజా సమాచారం


విద్యా సంవత్సరం 2020-21 నుంచి 2025-26 నాటికి పెరిగిన

ఎంబీబీఎస్ సీట్లు 48,563, పీజీ సీట్లు 29,080: జాతీయ వైద్య కమిషన్

కేంద్ర ప్రాయోజిత పథకాల పరిధిలో ఆర్థిక సంవత్సరం 2025-26 నుంచి

2028-29 వరకు10,023 అదనపు మెడికల్ సీట్లకు ప్రభుత్వ ఆమోదం

వైద్య విద్యలో ప్రమాణాలు పాటించేందుకు ఎంఎస్ఆర్, జీఎంఈఆర్ 2023, ఎంఎస్ఎంఈఆర్-2023, సీబీఎంఈ-2024 తదితర కీలక నియంత్రణలు

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2026 1:37PM by PIB Hyderabad

జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీఅందించిన సమాచారం ప్రకారం విద్యా సంవత్సరం 2020-21 నుంచి 2025-26 నాటికి ఎంబీబీఎస్ సీట్లు 48,563, పీజీ సీట్లు 29,080 వరకూ పెరిగాయిపెరిగిన ఎంబీబీఎస్పీజీ సీట్ల వివరాలు అనుబంధంలో ఉన్నాయిఅంతేకాకుండాఆర్థిక సంవత్సరం 2025-26 నుంచి 2028-29 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పరిధిలో ప్రభుత్వ కళాశాలల్లో 10,023 అదనపు సీట్లను చేర్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

వైద్యవిద్యలో పెరిగిన సీట్లు ప్రధానంగా వైద్య సేవలు అందని ప్రాంతాల్లో ఆరోగ్య రంగ నిపుణుల కొరతను తగ్గిస్తాయిఅలాగే రాష్ట్రాల్లో డాక్టర్-జనాభా నిష్పత్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయిమౌలిక వసతులుబోధనా సిబ్బంది పెంపువైద్య విద్య సీట్ల పెరుగుదలతో దేశీయ సంస్థలు భారతీయ విద్యార్థులకు మరింతగా అందుబాటులోకి వస్తాయి.

వైద్య విద్య నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించే ఉన్నత స్థాయి సంస్థ ఎన్ఎంసీ కీలక నియంత్రణలను జారీ చేసిందివీటిలో కనీస ప్రమాణాల అవసరాలు (ఎంఎస్ఆర్), పట్టభద్ర వైద్య విద్య నియంత్రణలు (జీఎంఈఆర్)-2023, వైద్య విద్య ప్రమాణాల నిర్వహణ నియంత్రణలు-2023 (ఎంఎస్ఎంఈఆర్-2023), సామర్ధ్య ఆధారిత వైద్య విద్య (సీబీఎంఈబోధనా మార్గదర్శకాలు-2024 తదితరమైనవి ఉన్నాయిఇవి వైద్య విద్యలో నిర్దేశిత ప్రమాణాలు అమలుకు భరోసానిస్తాయిదేశవ్యాప్తంగా వైద్య విద్యశిక్షణ సమగ్రతనునాణ్యతను కొనసాగించేందుకు ఈ నిబంధనలను రూపొందించారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2227604) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil