రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆత్మనిర్భర్ భారత్: భారతీయ ఉత్పాదనల కొనుగోలు కేటగిరీలో… 8 డార్నియర్-228 విమానాల కోసం హెచ్ఏఎల్‌తో రక్షణ శాఖ ఒప్పందం కాంట్రాక్టు విలువ... రూ.2,312 కోట్లు

प्रविष्टि तिथि: 12 FEB 2026 4:15PM by PIB Hyderabad

డార్నియర్ 228 రకం విమానాలు ఎనిమిదింటిని కొనుగోలు చేయడానికి కాన్పూర్ ‌లోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘బై (ఇండియన్కేటగిరీ’ ఒప్పందంలో భాగంగా దీంతో పాటుభారతీయ కోస్తాతీర రక్షక దళం (ఐసీజీకోసం ఆపరేషనల్ రోల్ ఎక్విప్‌మెంట్‌ను కూడా రూ.2,312 కోట్లు ఖర్చుతో ఎంఓడీ సమకూర్చుకోనుందిరక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఒప్పంద పత్రంపై ఈ రోజు సంతకాలయ్యాయి.

దీంతో హెచ్ఏఎల్ ఉత్పత్తి అనుబంధ విస్తారిత వ్యవస్థ దృఢతరమైచెప్పుకోదగ్గ స్థాయిలో ప్రత్యక్షపరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయనీసూక్ష్మచిన్నమధ్యతరహా సంస్థలకూఅనుబంధ పరిశ్రమలకూ పెద్ద ఎత్తున ఊతం లభిస్తుందనీ భావిస్తున్నారుఈ ఒప్పందం నిర్వహణమరమ్మతులుపూర్తి స్థాయి తనిఖీ (ఎంఆర్ఓ)కీజీవిత కాలం పాటు సాంకేతిక సేవల దిశగా అనేక అవకాశాలను కూడా అందిస్తుంది.

ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీకార్యక్రమాల విషయంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ ఒప్పందం పటిష్ఠపరచడంతో పాటుభారత నౌకా వాణిజ్య భద్రతా వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2227121) आगंतुक पटल : 94
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Malayalam