ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 10:31AM by PIB Hyderabad
దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
‘‘యస్యేమే హిమవన్తో మహిత్వా యస్య సముద్రం రసయా సహాహు:
యస్యేమా: ప్రదిశో యస్య బాహు కస్మై దేవాయ హవిషా విధేమ’’
‘‘ఏ దేశ కీర్తిని హిమాలయాలు ఆలాపిస్తున్నాయో, ఏ దేశ మహిమ నదులతో పాటు సముద్రంలోకి ప్రవహిస్తోందో, ఏ దేశానికి దిక్కులన్నీ ప్రణమిల్లుతాయో.. అటువంటి దేశానికి మనం మన సంపూర్ణ అస్తిత్వాన్ని అంకితం చేద్దాం’’ అనే సందేశాన్నిస్తోంది.
ఇదే భావనతో, అంత్యోదయ మార్గదర్శి పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ కూడా దేశంలో ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించడం కోసం జీవితాన్ని అంకితం చేశారని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘సర్వస్వాన్నీ సమర్పించడమంటే, దేశ ప్రజలు, మానవత అన్నిటి కన్నా మిన్న అనే చైతన్యాన్ని ప్రసరించడం. అంత్యోదయ పథ నిర్దేశకుడు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గారు కూడా ఇదే భావనతో దేశంలో ప్రజలను సాధికారులను చేయడానికి జీవితాన్ని అంకితం చేశారు.
‘‘యస్యేమే హిమవన్తో మహిత్వా యస్య సముద్రం రసయా సహాహు:
యస్యేమా: ప్రదిశో యస్య బాహు కస్మై దేవాయ హవిషా విధేమ’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2226537)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam