ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026కు పునఃప్రారంభమైన మీడియా రిజిస్ట్రేషన్లు: దరఖాస్తుకు ఇదే చివరి అవకాశం

प्रविष्टि तिथि: 11 FEB 2026 4:08PM by PIB Hyderabad

ఇండియా ఏఐ సదస్సులో పాల్గొనేందుకు మీడియా అక్రిడేషన్ నమోదు ప్రక్రియ 2025, డిసెంబర్ 29న ప్రారంభమై, 2026 ఫిబ్రవరి 8న పూర్తయిందిఅయితేరిజిస్ట్రేషన్లను పునఃప్రారంభించాలని గతంలో నమోదు చేసుకోలేకపోయిన వారి నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో మీడియా రిజిస్ట్రేషన్లను మరోసారి ప్రారంభించారుఅయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోడానికి మీడియా ప్రతినిధులకు ఇదే చివరి అవకాశంనమోదుకు 48 గంటలు మాత్రమే గడువిచ్చారు. 2026, ఫిబ్రవరి 13, సాయంత్రం గం.లతో ఈ ప్రక్రియ పూర్తవుతుందిరిజిస్టర్ చేసుకోవడానికి వెబ్‌సైట్https://impact.indiaai.gov.in/media-accreditation

తమ ఫారాలను సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా చదవమని దరఖాస్తుదారులకు సూచించారుసరైన పత్రాలను లేదా వివరాలను సమర్పించని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విలేకరులు మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.

గడువు పూర్తయిన తర్వాత మీడియా అక్రెడిటేషన్ కోసం ఎలాంటి వినతులను స్వీకరించరు.

 

***


(रिलीज़ आईडी: 2226492) आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Kannada , Malayalam