వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
రూ. 16.10 లక్షల కోట్ల విలువైన 352 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అంచనా వేసిన పీఎం గతిశక్తి నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్
పీఎం గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు
50 సంవత్సరాల వడ్డీ లేని రుణంగా రూ. 5,000 కోట్ల అందజేత
నాడు పోస్టు చేయడమైనది:
10 FEB 2026 3:34PM by PIB Hyderabad
దేశంలో మౌలిక సదుపాయాల ప్రణాళిక, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఉద్దేశంతో పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (పీఎంజీఎస్ ఎన్ఎంపీ) అక్టోబర్ 2021లో ప్రారంభించారు. పీఎం గతిశక్తి వ్యవస్థ కింద ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్ పీజీ).. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలిస్తుంది. సమీకృత ప్రణాళిక, మల్టీమోడాలిటీ, ఇంటర్-మోడాలిటీ, వివిధ శాఖల ప్రయత్నాల సమన్వయం, చివరి మైలు కనెక్టివిటీ, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి, డేటా ఆధారిత నిర్ణయాలు వంటి అంశాలను చేపట్టడం ఈ గ్రూప్ ప్రధాన బాధ్యత. ఇప్పటి వరకు సుమారు రూ. 16.10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 352 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎన్ పీజీ యంత్రాంగం పరిశీలించింది. ఈ 352 ప్రాజెక్టులలో 201 మాత్రమే మంజూరయ్యాయి. వీటిలో ప్రస్తుతం 167 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.
‘‘2022-23 సంవత్సరానికి రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం’’ లోని రెండో భాగం (పీఎం గతిశక్తికి సంబంధించిన ఖర్చుల కోసం) కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం రూ.5,000 కోట్లను కేటాయించింది. ఈ నిధులను రాష్ట్రాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం కింద ఆమోదించిన రాష్ట్రాల ప్రాజెక్టుల వివరాలు, కేటాయించిన నిధుల వివరాలు కూడా అందించారు.
పీఎం గతిశక్తి విధానం ద్వారా రూ.150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యయంతో ప్రణాళికతో రూపొందించిన, పరిశీలించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సహా కేంద్ర రంగ ప్రాజెక్టుల పర్యవేక్షనను ‘గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ’ నిర్వహిస్తుంది. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, అంచనా వ్యయం పెరగడం వంటి పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక నివేదిక జూలై 2025 నుంచి పీఏఐఎంఏఎన్ఏ (ప్రాజెక్ట్ అసెస్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్) పోర్టల్ https://ipm.mospi.gov.in/ReportPage లో ప్రచురితమవుతుంది.
ప్రాజెక్టుల పురోగతిని దశల వారీగా పర్యవేక్షించడం, సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, భారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల (రూ. 500 కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం కలిగినవి) అమలును వేగవంతం చేసే లక్ష్యంతో ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ) అనే సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారం, నిర్ణయాల వేగం పెంచేందుకు పీఎంసీ ప్రత్యేకమైన అయిదు అంచెల ఉన్నత స్థాయి విధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖ స్థాయిలో పరిష్కరించడం నుంచి మొదలుకొని అత్యంత సంక్లిష్టమైన సమస్యల పరిష్కారం కోసం ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్‌లీ ఇంప్లిమెంటేషన్) ఫోరం వరకు విస్తరించింది. ఈ విధానం సమీక్షా వ్యవస్థను సులభతరం చేయడమే కాకుండా, చేసిన పనిని మళ్లీ చేయడాన్ని కూడా నివారిస్తుంది. కీలకమైన సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించేలా చేస్తుంది. అడ్డంకులను తొలగించి, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా చూడటానికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను పీఎంజీతో అనుసంధానించారు. ఇది ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారాన్ని, నియంత్రణ అడ్డంకులను తొలగించడాన్ని వేగవంతం చేసింది.
ఈ సమచారాన్ని నేడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద లిఖిత పూర్వక సమాధానంగా అందించారు.
ప్రధానమంత్రి గతిశక్తి కింద ఎన్ పీజీ వ్యవస్థ ద్వారా అంచనా వేసిన ప్రాజెక్టుల మంత్రిత్వ శాఖల వారీగా వివరాలు
|
|
అనుబంధం-ఏ
|
Ministry/Department
|
Number
of Projects evaluated by NPG
|
Sanctioned
|
Yet to be
Sanctioned
|
Under
Implementation
|
Total
Estimated Cost
(Rs. in Crore)
|
|
Ministry of Road Transport and Highways
|
164
|
87
|
77
|
55
|
8,61,821
|
|
Ministry of Railways
|
137
|
83
|
54
|
83
|
4,22,324.84
|
|
Ministry of Housing and Urban Affairs
|
23
|
7
|
16
|
7
|
2,01,264
|
|
Ministry of Petroleum and Natural Gas
|
4
|
4
|
0
|
3
|
9,271
|
|
Ministry of Ports, Shipping and Waterways
|
3
|
2
|
1
|
1
|
49,758.86
|
|
Ministry of Civil Aviation
|
5
|
3
|
2
|
3
|
7,871
|
|
NICDC, Department
for Promotion of Industry and Internal Trade
|
12
|
12
|
0
|
12
|
28,693
|
|
Ministry of New and
Renewable Energy
|
01
|
1
|
0
|
1
|
20,773.70
|
|
Ministry of Electronics and Information Technology
|
01
|
0
|
1
|
0
|
4,680
|
|
Ministry of Textiles
|
02
|
02
|
0
|
2
|
3,957
|
|
Grand Total
|
352
|
201
|
151
|
167
|
16,10,414
|
అనుబంధం-బీ
2022-23 సంవత్సరానికి మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం పథకం పార్ట్-II కింద రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు.
|
Sr.
No.
|
States
|
No. of Projects approved by the
Department of Expenditure (DoE)
|
Approved Capital Expenditure
(Rs. in Crores)
|
|
1
|
West Bengal
|
30
|
376
|
|
2
|
Chhattisgarh
|
27
|
168.42
|
|
3
|
Bihar
|
21
|
502.92
|
|
4
|
Uttar
Pradesh
|
15
|
896.91
|
|
5
|
Madhya
Pradesh
|
11
|
393
|
|
6
|
Maharashtra
|
8
|
316
|
|
7
|
Tamil Nadu
|
8
|
204
|
|
8
|
Rajasthan
|
7
|
301
|
|
9
|
Assam
|
6
|
156
|
|
10
|
Nagaland
|
5
|
28.43
|
|
11
|
Kerala
|
4
|
96
|
|
12
|
Tripura
|
4
|
35
|
|
13
|
Gujarat
|
3
|
174
|
|
14
|
Haryana
|
3
|
55
|
|
15
|
Jharkhand
|
3
|
165
|
|
16
|
Manipur
|
3
|
36
|
|
17
|
Himachal
Pradesh
|
3
|
42
|
|
18
|
Arunachal
Pradesh
|
3
|
87.85
|
|
19
|
Andhra
Pradesh
|
2
|
202
|
|
20
|
Karnataka
|
2
|
182
|
|
21
|
Meghalaya
|
2
|
38
|
|
22
|
Mizoram
|
2
|
25
|
|
23
|
Uttarakhand
|
2
|
56
|
|
24
|
Goa
|
1
|
19
|
|
25
|
Punjab
|
1
|
90
|
|
26
|
Sikkim
|
1
|
19
|
|
27
|
Telangana
|
1
|
100
|
|
28
|
Odisha
|
0
|
0
|
|
|
Total
|
178
|
4764.53
|
మూలం: 2022-23 సంవత్సరానికి రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం పార్ట్-II కింద ప్రాజెక్టుల ఆమోదం కోసం వ్యయ విభాగం జారీ చేసిన కార్యాలయ మెమోరాండం.
|
|
***
(రిలీజ్ ఐడి: 2225962)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16