ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బస్తర్ పాండుమ్ వేడుకల సందర్భంగా ఛత్తీస్ గఢ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 10:42AM by PIB Hyderabad

ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ప్రత్యేక వేడుక బస్తర్ పాండమ్ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బస్తర్ సంస్కృతి, సంప్రదాయాలను, గిరిజన వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో, స్థానిక సంఘాలను బలోపేతం చేయటంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

"గతంలో బస్తర్ అనగానే మావోయిజం, హింస, అభివృద్ధిలో వెనకబాటుతనమే మొదటగా గుర్తొచ్చేవి. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బస్తర్ నేడు అభివృద్ధికి మాత్రమే కాక, స్థానిక ప్రజల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం శాంతి, ప్రగతి, సాంస్కృతిక గర్వంతో విలసిల్లాలన్నదే నా కోరిక" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా పోస్టుకు స్పందిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"7 से 9 फरवरी के बीच छत्तीसगढ़ में ‘बस्तर पंडुम’ का विशेष आयोजन किया गया। इस उत्सव के दौरान बस्तर की समृद्ध संस्कृति, परंपरा और जनजातीय विरासत का भव्य रूप दिखा। इस प्रयास से जुड़े अपने सभी परिवारजनों को मेरी हार्दिक बधाई। ऐसे आयोजन हमारी सांस्कृतिक विरासत को संरक्षित करने और स्थानीय समुदायों को सशक्त बनाने में अहम भूमिका निभाते हैं।

पहले जब बस्तर का नाम लिया जाता था तो माओवाद, हिंसा और विकास में पिछड़ेपन की छवि उभरती थी। लेकिन अब हालात बिल्कुल बदल चुके हैं। आज बस्तर विकास के साथ-साथ स्थानीय लोगों के बढ़ते आत्मविश्वास के लिए जाना जाता है। मेरी यही कामना है कि यहां का आने वाला समय शांति, प्रगति और सांस्कृतिक गौरव की भावना से परिपूर्ण हो।"


(రిలీజ్ ఐడి: 2225822) సందర్శకుల సూచీ సంఖ్య : : 101