వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకం, ఇది భారత ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు చేర్చడమే కాక వేగిరం చేస్తుంది: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్


భారత్ విధానం నిబద్ధత కలిగింది.. ఇది రాజీ పడేది కాదు

దౌత్యానికీ, అభివృద్ధికీ, ఆత్మగౌరవానికీ ప్రతీకగా.. వాణిజ్య ఒప్పందం

భారతీయ వ్యవసాయ ఉత్పాదనలకు సున్నా సుంకంతో అందుబాటులోకి రానున్న అమెరికా మార్కెట్

భారతీయ రైతులకు హాని కలిగించే ఏ ఉత్పాదననీ వాణిజ్య ఒప్పందంలో చేర్చలేదు

రైతులు, మహిళలతో పాటు యువత కలలకు కొత్త రెక్కలందించనున్న వాణిజ్య ఒప్పందం

‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్‌’ వైపు అడుగులు వేగంగా వేయడంలో

ఇలాంటి ఒప్పందాల పాత్ర కీలకం: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

నాడు పోస్టు చేయడమైనది: 08 FEB 2026 7:34PM by PIB Hyderabad

భారత్అమెరికాల మధ్య ఇటీవలి వాణిజ్య ఒప్పందం ‘‘చరిత్రాత్మకంఅపూర్వం’’ అని కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ  శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ వర్ణించారుఆయన భోపాల్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త వేగాన్ని ఇవ్వడంతో పాటు కొత్త శిఖరాలకు చేరుస్తుందని ఆయన అన్నారుఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదుఇది ప్రపంచంలో పెరుగుతున్న భారత ప్రతిష్ఠకు ఒక సంకేతమన్నారుభారత ఆర్థిక వ్యవస్థను ఈ ఒప్పందం పటిష్ఠపరచడంతో పాటు కొత్త  దిశను కూడా అందిస్తుందని తెలిపారుఈ ఒప్పందం పూర్తి ప్రపంచానికి కూడా ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోందని శ్రీ  శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు.


‘‘భారత విధానం నిబద్ధత కలిగిందనీరాజీ పడేది కాదనీ ప్రపంచానికి ఈ ఒప్పందం సందేశాన్నిస్తోందిమేం దేశ హితం కోరి నిర్ణయాల్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో తీసుకుంటాం’’ అని కేంద్ర మంత్రి అన్నారుఅంతర్జాతీయ వేదికపై భారత్ సమతౌల్య ప్రధానసకారాత్మక వ్యూహంతో ముందుకు పోతోందని ఆయన వివరించారుబేరసారాలాడే రాజకీయాలకు మేం పాల్పడంఅంతకన్నా సమతౌల్య వ్యూహాన్ని అనుసరించిసకారాత్మక చర్చల్ని నమ్ముతాంఈ కారణంగానే ఇవాళ భారత్ ప్రపంచ స్థాయిలో ఒక ఆధారపడదగినబలమైన భాగస్వామ్య దేశంగా ఎదుగుతోంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
దౌత్యంఅభివృద్ధిలతో పాటు ఆత్మగౌరవం

ఈ వాణిజ్య ఒప్పందం దౌత్యంఅభివృద్ధిలతో పాటు ఆత్మగౌరవానికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోందని కేంద్ర మంత్రి శ్రీ  శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారువీటిలో దౌత్యానికి అర్థం.. దేశానికే అగ్ర ప్రాధాన్యం అనీఈ ఒప్పందంలో భారత జాతీయ ప్రయోజనాలను అన్నిటి  కన్నా మిన్నగా చూశారన్నారుఅభివృద్ధి అంటే.. ‘వికసిత్ భారత్’ దిశగా కదం తొక్కడంఈ విషయంలో కూడా ఈ ఒప్పందం కీలక పాత్రను పోషిస్తుందిఇక ఆత్మగౌరవం అంటే అర్థం.. రైతుల స్వాభిమానమేమరి ఈ ఒప్పందంలో రైతుల గౌరవం విషయంలో పూర్తి శ్రద్ధను తీసుకోవడం చూసి నేను గర్వపడుతున్నానని మంత్రి అన్నారుభారతీయ వ్యవసాయంభారతీయ రైతుల విషయంలో దేశం మనసులో ఉన్న ఆందోళనలపై ఈ వాణిజ్య ఒప్పందంలో పరిష్కారాల్ని సాధించారని ఆయన వ్యాఖ్యానించారుఈ ఒప్పందం మన రైతుల్ని పూర్తి సురక్షితంగా ఉంచుతుందన్నారుఈ డీల్ ఒక్క భద్రతకు మాత్రమే పరిమితం కాదనీఇది కొత్త అవకాశాల్ని కూడా అందిస్తుందనీ శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారుఈ వాణిజ్య ఒప్పందం మన వ్యవసాయ ఉత్పాదనలకు ప్రపంచ మార్కెటులో కొత్త అవకాశాలను అందిస్తుందిఇది రైతులకు ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్రను పోషిస్తుందన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్‌’లకు ఇది బలమైన పునాదిని వేస్తుందని మంత్రి అన్నారు.
అమెరికాలో భారతీయ వ్యవసాయ ఉత్పాదనలకు సున్నా సుంకాలు
భారతీయ రైతులకు చెందిన అనేక వ్యవసాయ ఉత్పాదనలకు ఇక అమెరికాకు సున్నా సుంకంపై ఎగుమతి చేయవచ్చని కేంద్ర మంత్రి తెలిపారుఏమైనాఅమెరికా రైతుల వ్యవసాయ ఉత్పాదనలను భారతీయ మార్కెటులో ఈ రాయితీ అందబోదన్నారుభారత వ్యవసాయపాడి రంగ ప్రయోజనాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయన్నారుఅమెరికా వ్యవసాయ రంగంలో అనేక ఉత్పాదనలకు టారిఫ్‌లో చెప్పుకోదగ్గ కోతలను అనుమతించిందన్నారుఅనేక వ్యవసాయ ఉత్పాదనలపై టారిఫ్‌లు ఇదివరకు 50 శాతం వరకూ ఉండగా వాటిని అమెరికా తగ్గించిసున్నా స్థాయికి తీసుకు వచ్చిందని ఆయన చెప్పారువీటిలో మసాలాలుటీకాఫీకొబ్బరికాయకొబ్బరి నూనెవక్కజీడిపప్పువెజిటబుల్ వ్యాక్స్ఎవకాడోఅరటిజామమామిడికీవీబొప్పాయిఅనాసపుట్టగొడుగులతో పాటు కొన్ని రకాల గింజలు కూడా ఉన్నాయన్నారుభారత వ్యవసాయ ఎగుమతులు 2024-25 సంవత్సరంలో 4.45 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుకొన్నాయనీమసాలాల ఎగుమతిలో 88 శాతం వృద్ధి నమోదైందన్నారుప్రస్తుతం ఈ వాణిజ్య ఒప్పందం తరువాతమన మసాలాలకు అమెరికాలో కూడా కొత్త మార్కెట్లు పెద్ద స్థాయిలో అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు.
ప్రపంచ మసాలా మార్కెట్టులో భారత్ ఇప్పటికే బలమైన స్థితిలో ఉందని శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారుప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 ప్రాంతాలకు మసాలాల్నీమసాలా ఉత్పాదనల్నీ భారత్ ఎగుమతి చేస్తోందని తెలిపారుఈ ఒప్పందంతో మసాలాలుఇతర వ్యవసాయ ఉత్పాదనల ఎగుమతులకు మరింత వేగం జతపడుతుందని ఆయన చెప్పారుభారతీయ మార్కెటు భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు ఇవ్వలేదని స్పష్టం చేశారు.  విదేశీ వ్యవసాయ ఉత్పాదనలు భారత వ్యవసాయ మార్కెట్టులోకి ప్రవేశించాయంటేఅవి సుంకాలను చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారుమన రైతులకు పూర్తి స్వేచ్ఛ ఉందనీపూర్తి రక్షణ లభిస్తుందనీ తెలిపారుఇదే ఈ వాణిజ్య ఒప్పందంలో అన్నిటి కన్నా గొప్ప బలం అని ఆయన వివరించారు.
కీలక వస్తువులన్నిటికీ ఒప్పందం నుంచి మినహాయింపు
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయంవ్యవసాయ ఉత్పాదనల విషయంలో భారతీయ రైతుల ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి రాజీకీ ఆస్కారం ఇవ్వలేదనీరైతులకు నష్టం వాటిల్లే ఎలాంటి ఉత్పాదననీ ఒప్పందంలో చేర్చలేదనీ కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారుకీలక వస్తువులను ఒప్పందం పరిధికి బయటే ఉంచారన్నారుసోయాబీన్మక్కలుబియ్యంగోధుమచక్కెరముతక ధాన్యాలుపౌల్ట్రీపాడిఅరటిస్ట్రాబెరీచెరీపుల్లని పండ్లుపచ్చి బఠాణీలుకాబూలీ శనగలుపెసర్లునూనెగింజలుఇథనాల్‌లతో పాటు పొగాకు వంటి ఉత్పాదనలపై ఎలాంటి టారిఫ్ రాయితీలనూ ఇవ్వలేదన్నారుమన దేశ ప్రధాన ధాన్యాల విషయంలోనే అతి పెద్ద ఆందోళన నెలకొందని ఆయన గుర్తుచేశారుమన ప్రధాన ధాన్యాలపై ఆందోళన వ్యక్తం కాగావాటిని అన్నిటినీ పూర్తి సురక్షితంగా ఉంచారని నేను గర్వంగా చెబుతున్నానని మంత్రి అన్నారుప్రధాన ధాన్యాలుప్రధాన పండ్లతో పాటు పాడి ఉత్పాదనల విషయంలో అమెరికాకు తలుపులు తెరవడం జరగలేదని ఆయన వివరించారు.  
అమెరికాకు చెందిన అనేక వ్యవసాయ ఉత్పాదనలు ఏవీ కూడా భారతీయ మార్కెటులోకి అడుగు పెట్టజాలవని శ్రీ శివ్‌రాజ్ సింగ్ ఉద్ఘాటించారుపొట్టు తీసిన ధాన్యంపిండిగోధుమమక్కలుబియ్యంసిరిధాన్యాలుబంగాళదుంపలుఉల్లిపాయలుబీన్స్దోసకాయపుట్టగొడుగులుపప్పులుఘనీభూత ఖాద్య వస్తువులునారింజద్రాక్షనిమ్మకాయస్ట్రాబెరీతో పాటు డబ్బాల్లో వచ్చే మిక్స్‌డ్ వెజిటబుల్స్ భారత్‌కు రావని ఆయన స్పష్టం చేశారుపాడి ఉత్పాదనల గురించి ఆయన చెబుతూలిక్విడ్ మిల్క్పొడిక్రీమ్పెరుగుమజ్జిగవెన్ననెయ్యిబటర్ ఆయిల్పనీర్జున్ను.. వీటిలో దేనిని అయినా సరేభారత్‌‌లోకి రానివ్వరని తెలిపారువ్యవసాయంపాడి రంగాలకు తోడు.. అమెరికా నుంచి మిరియాలులవంగాలుపచ్చి మిరప ఒరుగులుసినమన్ (దాల్‌చీనీ), ధనియాలుజీలకర్రఇంగువఅల్లంపసుపుఅజ్‌వాయిన్మెంతులుకేసియాఆవాలుఆవాలుధాన్యపు పొట్టుఇంకా ఇతర పౌడర్ మసాలాల్ని భారత్ రావని వివరించారుఅర్థం స్పష్టంగా ఉంది.. మన మసాలాలుమన రైతులూ పూర్తిగా సురక్షితం అని ఆయన చెప్పారు.  


రైతులుమహిళలుయువతకు అవకాశాలు
ఈ ఒప్పందం భారతీయ రైతులకుమహిళలకుప్రత్యేకించి యువతకు ముందుకు వెళ్లడానికి కొత్త అవకాశాల్ని అందిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారుజౌళి వంటి మన అనేక రంగాల్లో ప్రస్తుతంపోటీదారు దేశాలతో పోలిస్తే మన సుంకాలను చెప్పుకోదగినంతగా దాదాపు 18 శాతానికి తగ్గించారని ఆయన అన్నారుదీంతో జౌళి ఎగుమతులకు కొత్త వేగంతో పాటు కొత్త దిశ లభిస్తుందన్నారుజౌళి ఎగుమతుల నేరు ప్రయోజనాలు మన రైతులకు కూడా కలుగుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నారుజౌళి అంటే అర్థం రైతులకు లాభం.. మరీముఖ్యంగా పత్తి పంటను పండించే రైతులకుదీంతో పాటురత్నాభరణాలువాహన విడిభాగాలుఇంజినీరింగ్ వస్తువులుఎమ్ఎస్ఎమ్ఈల వంటి శరవేగంగా పురోగమిస్తున్న రంగాల్లో కొత్త వ్యాపార అవకాశాలు అనేకం లభిస్తాయని ఆయన వివరించారుమన స్వయంసహాయక బృందాల్లోని సోదరీమణుల జీవితాలు ఈ ఒప్పందంతో సమృద్ధం అవుతాయనీఅనేక ఉత్పాదనల విషయంలో ముఖ్యపాత్రను వారు పోషిస్తుండడమే దీనికి కారణమనీ మంత్రి చెప్పారుఈ ఒప్పందం వారి శ్రమకూప్రతిభకూ ప్రపంచ వ్యాప్త గుర్తింపును తీసుకువస్తుందని శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇంతవరకు తొమ్మిది ఎఫ్‌టీఏలు పూర్తి అయ్యాయని శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారుఅమెరికాఒమన్న్యూజీలాండ్యూకేలతో కలిపి మొత్తం 27 దేశాలతో ఎఫ్‌టీఏలపై సంతకాలు అయ్యాయన్నారుఇతర దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయన్నారుఈ ఒప్పందాలన్నిటితో దేశానికి విస్తృత ప్రయోజనాలు దక్కుతాయని వివరించారుఈ ఒప్పందాల లాభాలు భారత ఆర్థిక వ్యవస్థరైతులుకార్మికులుపేదలుఎగుమతిదారులుతయారీదారులకు అందుతాయన్నారుఈ మాధ్యమం ద్వారామనం 2047 కల్లా వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చుకోగలుగుతామని వివరించారుఆత్మనిర్భర్ భారత్వికసిత్ భారత్‌లను నిర్మించడంలో ఈ ఒప్పందంతో పాటు ఇలాంటి అన్ని ఒప్పందాలు కీలక పాత్రను పోషిస్తాయన్నారుదీనికి గాను నేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2225570) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam