ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికిచ్చిన సమాధానం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 10:00PM by PIB Hyderabad
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఇచ్చిన సమాధానంలోని ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాల్ని పొందుపరుస్తూ, వాటిలో ఇలా పేర్కొన్నారు:
‘‘మన దేశం నిత్యం అభివృద్ధిలో కొత్త శిఖరాల్ని అందుకుంటూ, యవ్వనంతో తొణికిసలాడుతోంది. ఇది భలే మంచి యోగం’’.
‘‘ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలకు విశ్వసనీయ భాగస్వామ్య దేశంగా ఉంది. యూరోపియన్ యూనియన్‌తో, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలే దీనికి తాజా ఉదాహరణలు.’’
‘‘మీరు ప్రపంచాన్ని మోసం చేశారనుకోండి, అద్దంలో చూసుకొన్నప్పుడు.. మీ నిజరూపాన్ని మీరు ఎలా దాచిపెట్టుకుంటారు చెప్పండి..’’
‘‘కాంగ్రెస్ మరియు యూపీఏ హయాంలో, బ్యాంకింగ్ వ్యవస్థ సర్వనాశనం అంచుకు చేరింది.. దీంతో ఎన్‌పీఏ కొండలా పెరిగిపోయింది. మేం బ్యాంకింగ్ సంస్కరణలను తీసుకువచ్చి ఆ స్థితిని మార్చేశాం.’’
‘‘కాంగ్రెస్ ఊహకు మాత్రమే పరిమితమయ్యేది, మేం చేతలు చేసి చూపిస్తున్నాం.’’
‘‘సవాళ్లు ఎన్ని ఎదురయినా సరే.. 140 కోట్ల పరిష్కారాలు మన దగ్గర ఉన్నాయనే ఆలోచనతో మేం ముందుకు అడుగులు వేస్తున్నాం.’’
‘‘రాష్ట్రపతి పదవినీ, మహిళల్నీ, గిరిజనుల్నీ, రాజ్యాంగాన్నీ కాంగ్రెస్ ఘోరంగా అవమానించింది. ఆ పార్టీ వైఖరి వల్లే లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ వీలుపడలేదు.’’
‘‘కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు ఈ కారణంగానే మోదీకి గొయ్యిని తవ్వుతామని కలలు కంటున్నాయి..’’
‘‘భారత్ ఇక ఏ బస్సునూ మిస్ కాదు, పైపెచ్చు.. ఓ పెద్ద వాహనాల గుంపునకు సారథ్యం వహిస్తుంది.’’
(రిలీజ్ ఐడి: 2224770)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Gujarati
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam