సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రసార భారతి డిజిటల్-ఫస్ట్ కంటెంట్ వ్యూహం: వేవ్స్ ఓటీటీ, పే-పర్-వ్యూ విధానంతో డిజిటల్ దిశగా మార్పు.. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆదరణ
నాడు పోస్టు చేయడమైనది:
06 FEB 2026 3:24PM by PIB Hyderabad
ప్రసార భారతి ‘కంటెంట్ సేకరణ విధానం- 2024’ కింద ఆకాశవాణి, డీడీ ఛానెళ్లు, వేవ్స్ ఓటీటీ వేదికల కోసం కంటెంట్ సేకరణ జరుగుతోంది. 2025లో ప్రారంభించిన ‘వీక్షణల ఆధారిత చెల్లింపు (పే-పర్-వ్యూ)’ విధానంలో వేవ్స్ సహా డిజిటల్, ఓటీటీ వేదికల కోసం కంటెంటును సేకరిస్తున్నారు. సంప్రదాయ టీవీ, రేడియో ప్రసారాల నుంచి డిజిటల్ కంటెంట్ ప్రసారం దిశగా.. వ్యూహాత్మక మార్పును ఇది ప్రతిబింబిస్తోంది. డిజిటల్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణమైన కంటెంటును సేకరించేందుకు ఈ విధానం ప్రసార భారతికి తోడ్పడింది. దీనివల్ల సంస్థ తన పరిధిని గణనీయంగా విస్తరించుకోవడమే కాకుండా, ముఖ్యంగా యువతకు మరింత చేరువైంది.
దేశంలో విక్రయించే అన్ని టెలివిజన్ సెట్‌లలో ఇన్‌బిల్ట్ శాటిలైట్ ట్యూనర్ తప్పనిసరిగా ఉండాలని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా.. ఇకపై డీడీ ఫ్రీ డిష్ సెట్ టాప్ బాక్సుల పంపిణీ ప్రతిపాదనను కొనసాగించడం లేదు.
ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలోని దూరదర్శన్‌లో 1994 ఖాళీలు, ఆలిండియా రేడియో కేంద్రాల్లో (ఆకాశవాణి) 1636 ఖాళీలు ఉన్నాయి.
తన భూముల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం ప్రసార భారతి ఒక నిపుణుల సంస్థను నియమించుకుంది.
రాజ్యసభలో శ్రీ సుఖేందు శేఖర్ రే అడిగిన ప్రశ్నకు ఇచ్చిన ప్రశ్నకు.. సమాచార - ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2224760)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2