యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ క్రీడా విధానం

నాడు పోస్టు చేయడమైనది: 06 FEB 2026 9:28AM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం 10.07.2025న 'ఖేలో భారత్ నీతి-2025'ని ఆవిష్కరించిందిభారతదేశంలో బలమైనసమగ్రమైనఅత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడా వ్యవస్థను నిర్మించడమే ఈ విధానానికి ఉన్న ప్రధాన లక్ష్యం. 'దేశ నిర్మాణానికి క్రీడలుదేశ సమగ్ర అభివృద్ధి కోసం క్రీడల శక్తిని వినియోగించడంఅనేది ఈ విధానం దార్శనికతఈ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఖేలో భారత్ నీతి పలు కీలక అంశాలపై దృష్టి సారించిందివీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌లో  https://yas.nic.in/sites/default/files/Khelo-Bharat-Niti2025_0.pdfఅందుబాటులో ఉన్నాయి.

ఖేలో భారత్ నీతి-2025లో క్రీడా అవకాశాలను విస్తృతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారుఇందులో భాగంగా క్షేత్రస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపట్టణ గ్రామీణ ప్రాంతాల్లో  బాల్యంలోనే ప్రతిభను గుర్తించే వ్యవస్థను ప్రోత్సహించడం వంటి అంశాలను చేర్చారుఈ విధానం గ్రామీణపట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేలా.. ప్రాథమిక శిక్షణ సౌకర్యాలుప్రత్యేక క్రీడా మౌలిక సదుపాయాలుపోటీ వేదికలను అందుబాటులోకి తెస్తుందితద్వారా మహిళలుదివ్యాంగులుఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని విభాగాలకు చెందిన అథ్లెట్లకు సమాన అవకాశాలు కల్పించాలన్నది దీని లక్ష్యంపాఠశాల విద్యతో క్రీడలను అనుసంధానం చేయడంసామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంక్రీడల్లో పాల్గొనేందుకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి వివిధ భాగస్వామ్య పక్షాల మధ్య సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలను ఈ విధానం ప్రధానంగా తెలియజేస్తోందిఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలుక్రమబద్ధమైన శిక్షణ వ్యవస్థల్లో పెట్టుబడులను పెంచడంతో పాటు అథ్లెట్ల సన్నద్ధత విషయంలో నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో ఉన్నత స్థాయి శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను కూడా ఈ విధానం వివరిస్తోంది.

క్రీడలు అనేది రాష్ట్ర పరిధిలోని అంశం కావడంతో క్రీడల ప్రోత్సాహంఅభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక బాధ్యత ప్రధానంగా ఆయా రాష్ట్రకేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలపైనే ఉంటుందిజాతీయ క్రీడా విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన ప్రస్తుత పథకాలుకార్యక్రమాల ద్వారా ఈ ప్రయత్నాలకు అదనపు మద్దతును అందిస్తుందిఈ పథకాలు నిర్దేశించిన మార్గదర్శకాలునివేదికల చట్రం ప్రకారం అమలుకానున్నాయివీటి పనితీరుప్రభావాన్ని వ్యయ విభాగం జారీ చేసిన మూల్యాంకన మార్గదర్శకాలకు అనుగుణంగా తృతీయ పక్షం ద్వారా స్వతంత్రంగా మూల్యాంకనం చేసి అంచనా వేస్తారు

ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు

 

***


(రిలీజ్ ఐడి: 2224756) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Gujarati , Tamil