పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంట్ ప్రశ్న: వన్యప్రాణులు, జంతు పరిరక్షణ కార్యక్రమాలు

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 3:33PM by PIB Hyderabad

వన్యప్రాణుల సంరక్షణరక్షణనిర్వహణకు వన్యప్రాణుల (సంరక్షణచట్టం 1972 వీలు కల్పిస్తుందిఈ చట్టం వన్యజీవుల వేటను నియంత్రిస్తుందిఅలాగే అభయారణ్యాలు,  జాతీయ ఉద్యానవనాలుసంరక్షణ రిజర్వులుకమ్యూనిటీ రిజర్వులు ప్రకటించడానికి విధానాలను నిర్దేశిస్తుందిఈ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలుశిక్షలను కూడా విధిస్తుంది.

వన్యప్రాణుల సంరక్షణరక్షణవాటి ఆవాసాల మెరుగుదలే లక్ష్యంగా.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ‘‘డెవలప్‌మెంట్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ హ్యాబిటాట్స్’’ (వన్యప్రాణుల నివాసాల అభివృద్ధి),  ‘ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్’ కింద రాష్ట్రాలకుకేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఈ ప్రాంతానికి చెందని మొక్క జాతుల తొలగింపునీటి గుంతల ఏర్పాటుగడ్డి భూముల నిర్వహణఅగ్నిమాపక మార్గాల నిర్వహణమట్టితేమ సంరక్షణ పనులువేటగాళ్ల నిరోధక శిబిరాల ఏర్పాటునిర్వహణగస్తీ బృందాలుఆధునిక వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలువన్యప్రాణుల పశువైద్య సంరక్షణకు ఈ పథకాలు మద్దతిస్తాయిజంతువుల పర్యవేక్షణకుఅక్రమ చొరబాట్లను గుర్తించడం కోసం కెమెరా ట్రాప్‌లుడ్రోన్లు-సర్వైలెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తాయిమానవ వన్యప్రాణుల సంఘర్షణను నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో త్వరిత ప్రతిచర్య బృందాలకు సమాచారాన్ని అందించడంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటుకుస్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నిర్వహించే పర్యావరణ-అభివృద్ధి కార్యకలాపాలకు సహకరిస్తాయి.

పులిఏనుగుడాల్ఫిన్ వంటి కీలక జాతుల సంరక్షణను ప్రాజెక్ట్ టైగర్ప్రాజెక్ట్ ఎలిఫెంట్ప్రాజెక్ట్ లయన్ప్రాజెక్ట్ స్నో లెపార్డ్ (మంచు చిరుత), ప్రాజెక్ట్ డాల్ఫిన్ వంటి వాటిని ప్రత్యేక కార్యాచరణ పద్ధతిలో అమలు చేస్తున్నారు. ‘అత్యంత ప్రమాదంలో ఉన్న జాతులువాటి ఆవాసాల సంరక్షణ కోసం పునరుద్ధరణ కార్యక్రమం’ కింద గుర్తించిన 24 రకాల అంతరించిపోతున్న జాతులపై ప్రత్యేక దృష్టి సారించివాటి సంరక్షణ కోసం రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం అందిస్తుంది.

వన్యప్రాణుల సంఖ్య అంచనాను ఆయా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటాయిగుర్తించిన కీలక జాతుల సంఖ్య అంచనా జాతీయ స్థాయిలో జరుగుతుందిదేశంలో తొలిసారిగా నిర్వహించిన శాస్త్రీయ అంచనా ప్రకారం.. మంచు చిరుతల సంఖ్య 718 గానది డాల్ఫిన్ల సంఖ్య 6,327 గా నమోదైంది. 2022 అఖిల భారత పులుల అంచనా ప్రకారం.. దేశంలో పులుల సంఖ్య 3,682 (పరిధి 3167-3925) కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 2,967 (పరిధి 2603-3346) గా ఉండేది. ‘దేశంలో చిరుతపులుల స్థితి - 2022’ నివేదిక ప్రకారం.. దేశంలో చిరుతల సంఖ్య 13,874 (పరిధి 12,616– 15,132) గా భావిస్తున్నారు. 2018 నివేదికలో ఇది 12,852 (12,172-13,535) గా ఉంది.

వన్యప్రాణులను రక్షించడానికివృద్ధికిఅభివృద్ధికి తోడ్పడేలా దేశంలో రక్షిత ప్రాంతాల వ్యవస్థను ఏర్పాటు చేశారుఈ రక్షిత ప్రాంతాల సంఖ్య 2020లో 981 ఉండగా, 2025 నాటికి 1134కు పెరిగిందిఅదేవిధంగా ఇదే కాల వ్యవధిలో పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య 50 నుంచి 58కిఏనుగుల సంరక్షణ కేంద్రాల సంఖ్య 30 నుంచి 33కి పెరిగాయిపర్యావరణ అనుసంధానతను కొనసాగించడానికి 32 పులుల కారిడార్లను, 150 ఏనుగుల కారిడార్లను గుర్తించారుజాతీయ పార్కులుఅభయారణ్యాలుపులులుఏనుగుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ ఎంత సమర్థవంతంగా జరుగుతుందో అంచనా వేసేందుకు  'మేనేజ్‌మెంట్ ఎఫెక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్' (నిర్వహణ ప్రభావశీల మూల్యాంకనం-ఎంఈఈప్రక్రియను కూడా చేపట్టారు.

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ నేడు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2224124) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Tamil