అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో మూడో ల్యాంచ్ ప్యాడ్ (టీఎల్‌పీ)

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 3:46PM by PIB Hyderabad

2025 మార్చి 21న ఆర్థిక ఆమోదం లభించిన అనంతరం.. అదే ఏడాది మూడో త్రైమాసికంలో ఈ ప్రాంతానికి సంబంధించిన భౌగోళిక-సాంకేతిక పరీక్షలుటోపోగ్రఫీ సర్వే పూర్తయ్యాయిఅన్ని వ్యవస్థల రూపకల్పన పూర్తి కాగాటెండర్ల సన్నద్ధత పురోగతి దశలో ఉందిఇప్పటి వరకు రెండు టెండర్లను పిలిచారుప్రస్తుతం అప్రోచ్ రోడ్ల నిర్మాణంతాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాటుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయిప్రొపెల్లెంట్ స్టోరేజీసర్వీసింగ్ వ్యవస్థలుమొబైల్ లాంచ్ వేదికపిడుగుల నుంచి రక్షణ అందించే టవర్లువాహన ఇంటిగ్రేషన్ భవనాలకు రైలు ట్రాకుల ఏర్పాటుజెట్ డిఫ్లెక్షన్ డక్ట్ వంటి కీలక నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదు. 2029 మార్చి నాటికి పీడీసీ పూర్తి చేయాలనేది లక్ష్యం.

మూడో ల్యాంచ్ ప్యాడ్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో ప్రైవేటు పరిశ్రమలుఎంఎస్ఎంఈలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారుమేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యమిస్తూ.. ఈ విభాగంలో ఇప్పటికే అమల్లో ఉన్న సేకరణ వ్యవస్థలకు అనుగుణంగా అన్ని టెండర్ల ప్రక్రియలను అమలు చేయాలని ప్రతిపాదించారు.

రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని సిబ్బందిప్రజా ఫిర్యాదులుపింఛన్ల శాఖప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2224121) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR