రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే ట్రాక్‌లపై ఏనుగుల మరణాన్ని నివారించడానికి ఏఐ-ఆధారిత చొరబాటు గుర్తింపు వ్యవస్థ (ఐడీఎస్)ను రూపొందించిన భారతీయ రైల్వే
డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సార్లు (డీఏఎస్) ఉపయోగించి లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, కంట్రోల్ రూమ్‌ను
అప్రమత్తం చేసేలా వ్యవస్థ రూపకల్పన
ఎన్ఎఫ్ఆర్ (403.42 రూట్ కిలోమీటర్లు), ఈసీవోఆర్ (368.70 రూట్ కిలోమీటర్లు), ఎస్ఆర్ (55.85 రూట్ కిలోమీటర్లు), ఎన్ఆర్ (52 రూట్ కిలోమీటర్లు), ఎస్ఈఆర్ (55 రూట్ కిలోమీటర్లు), ఎన్ఈఆర్ (99.18 రూట్ కిలోమీటర్లు), డబ్ల్యూఆర్ (115 రూట్ కిలోమీటర్లు), ఈసీఆర్ (20.3 రూట్ కిలోమీటర్లు)లను కవర్ చేస్తూ
మంజూరైన ఐడీఎస్ పనులు
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 4:56PM by PIB Hyderabad
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలతో సమన్వయం ద్వారా రైల్వే పట్టాలపై ఏనుగులు మరణాలను నిరోధించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ అనేక రక్షణ చర్యలు తీసుకుంది. అవి కింది విధంగా ఉన్నాయి:
(i) డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సార్‌లను (డీఏఎస్) ఉపయోగించి రైల్వే ట్రాక్‌లపై ఏనుగుల ఉనికిని గుర్తించడానికి ఏఐ- ఆధారిత ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్) ను అభివృద్ధి చేశారు. వ్యవస్థలో ఆప్టికల్ ఫైబర్, హార్డ్‌వేర్, ఏనుగుల కదలికల కోసం ప్రీ-ఇన్‌స్టాల్డ్ సిగ్నేచర్‌లు భాగంగా ఉన్నాయి. రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఏనుగుల కదలికను గుర్తించి లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, కంట్రోల్ రూమ్‌లను సకాలంలో అప్రమత్తం చేయడం ద్వారా సత్వర నివారణ చర్యలు తీసుకోవడానికి వీలుగా హెచ్చరికలను పంపించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
ప్రస్తుతం ఈశాన్య సరిహద్దు రైల్వేలో అటవీ శాఖ గుర్తించిన క్లిష్టమైన, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో 141 రూట్ కిలోమీటర్లకు పైగా పరిధిలో ఐడీఎస్ పని చేస్తోంది. భారతీయ రైల్వేలోని ఎన్ఎఫ్ఆర్ (403.42 రూట్ కిలోమీటర్లు), ఈసీవోఆర్ (368.70 రూట్ కిలోమీటర్లు), ఎస్ఆర్ (55.85 రూట్ కిలోమీటర్లు), ఎన్ఆర్ (52 రూట్ కిలోమీటర్లు), ఎస్ఈఆర్ (55 రూట్ కిలోమీటర్లు), ఎన్ఈఆర్ (99.18 రూట్ కిలోమీటర్లు), డబ్ల్యూఆర్ (115 రూట్ కిలోమీటర్లు), ఈసీఆర్ (20.3 రూట్ కిలోమీటర్లు) డివిజన్లను కవర్ చేస్తూ గుర్తించిన కారిడార్‌లకూ ఐడీఎస్ పనులు మంజూరయ్యాయి.
(ii) ఏనుగులను రైలు ఢీకొన్న సందర్భంలో, జోనల్ రైల్వేలు అటవీ శాఖతో సన్నిహిత సమన్వయంతో ఈ విషయాన్ని దర్యాప్తు చేసి తదనుగుణంగా తక్షణ చర్యలు తీసుకుంటాయి. గుర్తించిన ప్రదేశాల్లో తగిన వేగ పరిమితులను విధించడం... రైల్వే సిబ్బందిని, స్టేషన్ మాస్టర్లను అప్రమత్తం చేయడం వీటిలో భాగంగా ఉన్నాయి. రైల్వే సిబ్బందికి దీని గురించి తగిన అవగాహన కలిగించేందుకు వీలుగా సంబంధిత అటవీ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో సగటున సుమారు 16 ఘటనలు నమోదయ్యాయి.
(iii) గుర్తించిన ప్రదేశాల్లో ఏనుగుల కదలిక కోసం అండర్‌పాస్‌లు, ర్యాంప్‌ల నిర్మాణం.
(iv) ఏనుగులు రైల్వే లైన్ల వైపు రాకుండా నిరోధించడానికి ముప్పు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పట్టాల వెంబడి
తగిన విధంగా కంచెలను ఏర్పాటు చేయడం.
(v) లోకో పైలట్లను ముందస్తుగా హెచ్చరించడానికి గుర్తించిన అన్ని ఏనుగు కారిడార్లలో సైనేజ్ బోర్డులను ఏర్పాటు చేయడం.
(vi) రైల్వే భూమిలోని ట్రాక్ పరిసరాల్లో ఉన్న వృక్షసంపద, ఆహారసంబంధ వస్తువులను తొలగించడం.
(vii) అటవీ ప్రాంతంలో సౌర శక్తితో పనిచేసే ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయడం.
(viii) స్టేషన్ మాస్టర్, లోకో పైలట్‌లను అప్రమత్తం చేయడం ద్వారా సకాలంలో చర్యలు తీసుకోవడానికి అటవీ శాఖ నియమించిన ఏనుగు ట్రాకర్లను ఏర్పాటు చేయడం.
(ix) రైల్వే ట్రాక్‌ల సమీపంలో అడవి జంతువులు/ఏనుగుల కదలికలను నిరోధించడానికి, లెవల్ క్రాసింగ్‌ల వద్ద వినూత్నమైన హనీ బీ బజర్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ పరికరం సృష్టించే శబ్దం ఏనుగులను రైల్వే ట్రాక్ నుంచి దూరంగా తరలించడంలో సహాయపడుతుంది.
(x) రాత్రి సమయంలో గానీ, వెలుతురు సరిగా లేని సమయంలో గానీ ట్రాక్‌పై అడవి జంతువుల ఉనికిని గుర్తించడానికి వీలుగా థర్మల్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది అడవి జంతువుల ఉనికి గురించి లోకో పైలట్‌లను అప్రమత్తం చేస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వేలు, సమాచార-ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2223817)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11