ప్రధాన మంత్రి కార్యాలయం
మణిపూర్ నూతన ముఖ్యమంత్రి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 7:50PM by PIB Hyderabad
మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి నెమ్చా కిప్జెన్, శ్రీ లొసియి దిఖోలకు ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు మణిపూర్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొంతౌజం గోవిందాస్ సింగ్, శ్రీ ఖురైజం లోకేన్ సింగ్‌లను అభినందించారు.
రాష్ట్ర నూతన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ.. మణిపూర్ సోదరీసోదరీల అభివృద్ధి, శ్రేయస్సు కోసం వీరు అంకితభావంతో పని చేస్తారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్‌కు నా అభినందనలు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి నెమ్చా కిప్జెన్, శ్రీ లోసియి దిఖో, అలాగే మణిపూర్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కొంతౌజం గోవిందాస్ సింగ్, శ్రీ ఖురైజం లోకెన్ సింగ్‌లకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
మణిపూర్‌లోని నా సోదరసోదరీల అభివృద్ధి, శ్రేయస్సు కోసం వారు శ్రద్ధగా కృషి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను’’
***
(రిలీజ్ ఐడి: 2223805)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam