చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఎల్ఎల్‌బీ డిగ్రీ గుర్తింపు
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 1:00PM by PIB Hyderabad
ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలు, న్యాయ కళాశాలలు అందించిన ఈవెనింగ్ ఎల్ఎల్‌బీ కోర్సులకు గతంలో అమల్లో ఉన్న న్యాయ విద్య నియమాలు-1989 ప్రకారం అనుమతులను, గుర్తింపును బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అందించేది. ఇది అప్పటి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేది. అయితే 2000-2001 విద్యా సంవత్సరం నుంచి న్యాయ విద్య ప్రమాణాలు, న్యాయ డిగ్రీల గుర్తింపు (నియమాలు) అని పిలిచే న్యాయ విద్య నియమాలు-1999 ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈవెనింగ్ లా డిగ్రీ కోర్సుల గుర్తింపును రద్దు చేసింది.
నాయ్య విద్య నియమాలు - 2008 ప్రకారం ఈ పద్ధతిని ఇండియన్ బార్ కౌన్సిల్ స్థిరంగా కొనసాగిస్తోంది. దీని ప్రకారం ఎల్ఎల్‌బీను సాధారణ, పూర్తి స్థాయి వృత్తిపరమైన కోర్సుగా తప్పనిసరి చేసింది. దీనికి రోజువారీగా, వారంవారీగా తరగతి గంటలు, కనీస హాజరు, ఉదయం 8గం.ల నుంచి సాయంత్రం 7గం.ల వరకు నిర్దేశిత బోధనా పద్ధతులు అవసరం. అదే విధంగా, 2000-2001 నుంచి ఏ రాష్ట్రంలోనూ ఈవెనింగ్, నైట్ స్కూల్, పార్ట్-టైం, వీకెండ్, హాలిడే, ఆన్లైన్, డిస్టెన్స్ ఎల్ఎల్‌బీ కోర్సులను నిర్వహించడం లేదు. చట్టబద్దమైన నియమాలు, ఉత్తర్వుల ద్వారా ఇండియన్ బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
పైన పేర్కొన్న విధంగా విద్యా సంవత్సరం 1999-2000 వరకు ఈవెనింగ్ క్లాసుల ద్వారా లా డిగ్రీని పూర్తి చేసిన ఎల్ఎల్‌బీ పట్టభద్రులు అడ్వకేట్లుగా నమోదు చేసుకొనేందుకు అర్హులు. ఆ తర్వాత పూర్తి చేసినవారికి అర్హత ఉండదు.
రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఈ సమాచారాన్ని లిఖిత పూర్వక సమాధానంగా న్యాయ శాఖ సహాయ (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2223794)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21