ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒకే, ఏకీకృత, విస్తరణ యోగ్య వేదికగా కస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌.. 2 ఏళ్లలో అమల్లోకి


ప్రత్యేక ఆర్థిక మండలంలో లేదా సముద్ర మధ్యలో చేపల్ని వేటాడే

భారతీయ ఫిషింగ్ నౌకకు పన్ను నుంచి మినహాయింపు

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 12:55PM by PIB Hyderabad

కస్టమ్స్ ప్రక్రియలన్నింటికీ ఒకేఏకీకృతమైనవిస్తరణ యోగ్యమైన కస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ (సీఐఎస్)ను కేంద్ర ప్రభుత్వం  సంవత్సరాల్లో అమలులోకి తీసుకువస్తుంది.

కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2026-27 కేంద్ర బడ్జెటును ఈ రోజు పార్లమెంటుకు సమర్పిస్తూఈ విషయాన్ని వెల్లడించారుప్రతి కంటెయినరునూ క్షుణ్నంగా తనిఖీ చేసే లక్ష్యంతో ఆధునిక ఇమేజింగ్‌‌తో పాటు నష్టభయాన్ని (రిస్క్అంచనా వేయడానికి కృత్రిమ మేధ పరిజ్ఞానం సాయంతో లోపలకు చొరబడకుండావెలుపలి నుంచే స్కానింగ్ చేసే పద్ధతిని దశలవారీగా ప్రధాన ఓడరేవులన్నిటిలో కల్పిస్తామని మంత్రి అన్నారు.
ఆర్థిక సంవత్సరం చివరికల్లావివిధ ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఓడ సరుకు క్లియరెన్సుకు అవసరమయ్యే అన్ని ఆమోదాలను ఒకేఅంతర-సంధానిత డిజిటల్ వేదిక ద్వారా అంతరాయాలకు తావు ఉండని విధంగా ప్రాసెస్ చేస్తారని కూడా కేంద్ర మంత్రి తెలిపారు.
 
చట్టం అనుమతి లేని ఆహార పదార్థాలుమత్తుమందులుమొక్కలుపశువులువన్యప్రాణులకు సంబంధించిన ఉత్పాదనలు ఓడల్లో చేరవేస్తున్న సరుకుల్లో దాదాపు 70 శాతం ఉంటుండడంతో వాటిని జప్తు చేస్తున్నారుఇలాంటి సరుకుల తనిఖీ ప్రక్రియల్ని 2026 ఏప్రిల్ నాటికే ఆచరణలోకి తీసుకువస్తారని ఆమె వివరించారు.
నియమాలను పాటించనక్కర లేని వస్తువులకుదిగుమతిదారు సంస్థ నమోదు ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన వెంటనే కస్టమ్స్ వారు క్లియరెన్సు ఇస్తారనీఅయితే సుంకం  చెల్లింపు పూర్తి అయి ఉండాలనీ కేంద్ర మంత్రి అన్నారు.
ఎగుమతికి సంబంధించిన కొత్త అవకాశాలు:
భారతీయ మత్స్యకారులకు మన ప్రాదేశిక జలాలకు ఆవల సముద్ర వనరుల ఆర్థిక విలువను పూర్తిగా రాబట్టుకొనేలా సాయపడటానికి ఈ కింది చర్యల్ని చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు:
ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్),  లేదా సముద్ర మధ్యంలో చేపల్ని వేటాడే భారతీయ ఫిషింగ్ నౌక సంపాదించిన చేపలపై సుంకాన్ని చెల్లించాల్సిన పని ఉండదు.
బిఅలా సంపాదించిన చేపల్ని విదేశీ ఓడరేవులో దింపినట్లయితేసదరు సరుకును ఎగుమతి చేసిన వస్తువులుగా లెక్క లోకి తీసుకుంటారు.
చేపల వేటలోనూరవాణాలోనూవేర్వేరు రవాణా సాధనాల్లోకి బదలాయించడం (ట్రాన్స్‌షిప్‌మెంట్)లోనూ అనుచిత ప్రయోగాల్నీదుర్వినియోగాన్నీ అరికట్టడానికి తగిన రక్షణ చర్యలను ప్రవేశపెడతామని కూడా ఆమె తెలిపారు.
దేశ చిన్న వ్యాపార సంస్థలనూచేతివృత్తి కళాకారులనూఅంకుర సంస్థలనూ ఈ-కామర్స్ మాధ్యమం ద్వారా విదేశీ మార్కెట్లలో పాల్గొనేటట్లు ప్రోత్సహించడానికి కొరియర్ ద్వారా చేసే ఎగుమతులకు ఒక్కొక్క కన్‌సైన్‌మెంటుకూ ఇప్పుడు వర్తింపచేస్తున్న రూ.10 లక్షల పరిమితిని ఇక పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారుదీనికి అదనంగాస్వీకరించనిలేదా వాపసు చేసిన సరుకుల విషయంలో.. అలా జరగడానికి ఆస్కారం ఉన్న కన్‌సైన్‌మెంటులను సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ముందుగా గుర్తించిస్థితిని మెరుగుపరుస్తారని ఆమె వివరించారు.

నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులు తమ బకాయిలన్నింటినీ చెల్లించి వివాదాలను పరిష్కరించుకోవడానికి సుముఖంగా ఉన్నారనీఅయితే వారిని జరిమానాకు సంబంధించిన భయాలు నిరుత్సాహపరుస్తున్నాయనీ ఆర్థిక మంత్రి అన్నారువారు ఇక జరిమానాకు బదులుగా అదనపు సొమ్మును చెల్లించి కేసుల్ని ముగించుకోవచ్చని ఆమె అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2221602) సందర్శకుల సూచీ సంఖ్య : : 69
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam