ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"సెల్-ఇ-బ్రెషన్‌"ను ప్రారంభించిన సెయిల్: ‘స్టీల్-టు-సోల్’ అనుబంధాన్ని వేడుకగా జరుపుకునే జాతీయ స్థాయి సృజనాత్మక పోటీ

प्रविष्टि तिथि: 31 JAN 2026 5:07PM by PIB Hyderabad

ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న పీఎస్‌యూ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), మైగవ్ భాగస్వామ్యంతో 30 జనవరి 2026న "సెల్-ఇ-బ్రెషన్‌: స్టీల్ బిల‌్ట్ ఇండియా, సెయిల్ బిల్ట్‌ ట్రస్ట్" పేరుతో జాతీయ స్థాయి సృజనాత్మక పోటీని ప్రారంభించింది. ఈ పోటీ ద్వారా ఆకర్షణీయమైన రీల్స్, సినిమాటిక్ కథలు, డిజిటల్ ప్రకటనల ద్వారా సృజనాత్మకతను చాటి చెప్పాల్సిందిగా భారత పౌరులను ఆహ్వానిస్తోంది.

ప్రచార లక్ష్యాలు

ప్రతి భారతీయుడి దైనందిన జీవితంలో సెయిల్ పాత్రను చాటిచెప్పటమే ‘సెల్-ఇ-బ్రెషన్‌’ ప్రాథమిక లక్ష్యం. సెయిల్‌ను కేవలం ఒక సంస్థగా కాక, ప్రతి ఒక్కరికీ "నమ్మకమైన స్నేహితుడి"గా పరిచయం చేస్తూ, వినియోగదారులతో "స్టీల్-టు-సోల్" అనే భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచటం ఈ ప్రచార ఉద్దేశం. దేశానికి అవసరమైన భారీ మౌలిక సదుపాయాలను నిర్మించటమే కాక, సామాన్య పౌరుల జీవితాల్లోని అమూల్యమైన క్షణాలకు రక్షణగా సెయిల్ నిలుస్తుందని ఇది తెలియజేస్తుంది.

పోటీ ప్రధానాంశాలు

పాల్గొనేవారు నాలుగు రకాల విభిన్న కథనాలను ఎంచుకోవచ్చు:

1.   నవ భారత నిర్మాణ స్వప్నాలు: దేశానికి ‘నరాలు, ఎముకలు’ వంటి కీలక నిర్మాణాలైన రైల్వేలు, వంతెనలు, రహదారుల నిర్మాణంలో సెయిల్ పాత్రను ప్రదర్శించాలి.

2.   రక్షణ కవచం, కీర్తి తార: జాతీయ భద్రతలో సెయిల్ తోడ్పాటును (ట్యాంకులు, యుద్ధ నౌకలు), అంతరిక్ష పరిశోధనలో సాధిస్తున్న విజయాలను ప్రముఖంగా చూపాలి.

3.   ప్రతి ఒక్కరి జీవితంలో సెయిల్ భాగస్వామ్యం: పాఠశాలలు, ఆస్పత్రులు, క్రీడా కార్యక్రమాల ద్వారా సమాజంపై సెయిల్ చూపిస్తున్న సానుకూల ప్రభావాన్ని వివరించాలి.

4.   అంతటా ఉత్పత్తులు: ఇళ్లు, కార‌్యాలయాలు, నగరాల్లో అదృశ్య నేస్తంలా నిత్యం తోడుండే సెయిల్ ఉత్పత్తులను ప్రత్యేకంగా చూపాలి.

 

బహుమతులు, గుర్తింపు

భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించటానికి, సత్కరించటానికి టాప్ 5 క్రియేటర్లకు ప్రత్యేక బహుమతులు:

·         నగదు బహుమతి: ఒక్కొక్కరికి రూ.10,000.

·         అధికారిక గుర్తింపు: సెయిల్ నుంచి ప్రశంసా పత్రం, ధ్రువీకరణ పత్రం.

·         జాతీయ స్థాయిలో గుర్తింపువిజేతల సృజనాత్మకతను సెయిల్ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ప్రదర్శన.

ఎలా పాల్గొనాలి

·         అర్హతలు: భారతీయ పౌరులంతా పాల్గొనవచ్చు.

·         ఫార్మాట్: వీడియోలు కచ్చితంగా ఎంపీ4 ఫార్మాట్‌, 1080పీ రిసొల్యూషన్, 120 నిమిషాల వరకు నిడివి ఉండాలి (2 నిమిషాలు).

·         భాష: నమోదులను హిందీ లేదా ఆంగ్లంలో స్వీకరిస్తారు.

·         సమర్పణ: పాల్గొనేవారు తమ వీడియోలను ఏదైనా క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో (గూగుల్ డ్రైవ్ లేదా యూట్యూబ్‌లో అన్‌లిస్టెడ్‌ లింక్‌గా) అప్‌లోడ్ చేయాలి. అనంతరం, ఆ లింక్‌ను మైగవ్‌ పోర్టల్ ద్వారా సమర్పించాలి.

·         గడువు: పోటీకి సంబంధించిన అన్ని ఎంట్రీలను ఫిబ్రవరి 16, 2026 (రాత్రి 11:59 గంటలు ఐఎస్‌టీ)లోపు సమర్పించాలి.

మైగవ్ లింక్:

https://www.mygov.in/task/sail-e-bration-steel-built-india-sail-built-trust-reel-contest/

 

****


(रिलीज़ आईडी: 2221340) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी