ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పట్నా పక్షుల అభయారణ్యం, ఛారీ-ధండ్‌లను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని స్వాగతించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 31 JAN 2026 10:52AM by PIB Hyderabad

ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్నికచ్ (గుజరాత్)లోని ఛారీ-ధండ్‌ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారుస్థానికులకుచిత్తడి నేలల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారుజీవవైవిధ్యాన్ని కాపాడటంలోకీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో తమ చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ:

‘‘ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్నికచ్ (గుజరాత్)లోని ఛారీ-ధండ్‌‌ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడం ఆనందదాయకంఅక్కడి స్థానికులకుచిత్తడి నేలల పరిరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శుభాకాంక్షలుజీవవైవిధ్యాన్ని కాపాడటంలోకీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో మా చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందిఈ చిత్తడి నేలలు అనేక వలసస్థానిక జీవ జాతులకు సురక్షితమైన ఆవాసాలుగా కొనసాగుతాయని ఆకాంక్షిస్తున్నాను.’’

 

***


(రిలీజ్ ఐడి: 2221302) సందర్శకుల సూచీ సంఖ్య : : 17