ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో ఈ రోజు నుంచి మొదలైన బడ్జెట్ సమావేశాలు: ప్రధానమంత్రి


రాష్ట్రపతి ప్రసంగం భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశను చూపింది..

భారత్ ఇటీవల సాధించిన అసాధారణ అభివృద్ధిని కూడా ప్రతిబింబించింది: ప్రధాని

प्रविष्टि तिथि: 28 JAN 2026 3:17PM by PIB Hyderabad

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారుఈ రోజు రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రసంగం సమగ్రంగానూలోతైన అవగాహనతోనూ ఉందని శ్రీ మోదీ తెలిపారురాష్ట్రపతి ప్రసంగం భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపిందనీభారత్ ఇటీవల సాధించిన అసాధారణ అభివృద్ధిని కూడా ప్రతిబింబించిందనీ ప్రధానమంత్రి అన్నారు.
వికసిత్ భారత్‌ నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యం ఇవాళ్టి ప్రసంగంలో ప్రస్ఫుటం అయిందనీబలమైనస్వయంసమృద్ధమైన దేశాన్ని తీర్చిదిద్దాలన్న మన ఉమ్మడి ఆకాంక్షకు అద్దం పట్టిందనీ శ్రీ మోదీ అన్నారు. ‘‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ను మరింత వేగంగా పరుగులు పెట్టించాలన్న మన అందరి సంకల్పాన్నీనవకల్పనతో పాటు సుపరిపాలనకు ఇస్తున్న ప్రాధాన్యాన్నీ ఈ ప్రసంగం పునరుద్ఘాటించింది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ఇవ్వడంతోపార్లమెంటు బడ్జెటు సమావేశాలు ఈ రోజు మొదలయ్యాయిఈ ప్రసంగానికి మన పార్లమెంటరీ సంప్రదాయాల్లోఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.. రాబోయే నెలల్లో మన దేశ అభివృద్ధి ప్రయాణానికి మార్గదర్శకత్వాన్ని వహించే సామూహిక సంకల్పంతో పాటు విధాన రూపకల్పనకు ఈ ప్రసంగం మార్గదర్శకంగా ఉంటుంది.

ఇవాళ్టి ప్రసంగం సమగ్రంగాలోతైన అవగాహనతో ఉందిఇది భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశను చూపుతూనేభారత్ ఇటీవలి అసాధారణ అభివృద్ధి ప్రయాణ జోరును ప్రతిబింబించిందివికసిత్ భారత్‌ను నిర్మించడానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేసింది.. ఒక బలమైనస్వయంసమృద్ధ దేశాన్ని తీర్చిదిద్దాలన్న మన ఉమ్మడి ఆకాంక్షకూ అద్దం పట్టిందిఈ ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయిరైతులుయువతపేదలుఅణచివేతకు గురైన వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాలను చాటిచెప్పింది ఈ ప్రసంగంసంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ను మరింత వేగంగా నడపడంతో పాటు నవకల్పనపైసుపరిపాలనపై తీసుకొంటున్న శ్రద్ధను ఇది పునరుద్ఘాటించింది’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2219669) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam