ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 25 JAN 2026 8:54AM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

హిమాచల్ ప్రదేశ్‌ను ప్రకృతి, సంస్కృతుల అపూర్వ సంగమంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల విశేష ప్రతిభ, పరాక్రమాన్ని ఆయన ప్రశంసిస్తూ.. వారు ఎల్లప్పుడూ భారతమాత సేవకు తమను అంకితం చేస్తూ వచ్చారని పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవభూమి నిరంతర అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ప్రకృతి మరియు సంస్కృతి సంగమమైన హిమాచల్ ప్రదేశ్‌లోని నా కుటుంబ సభ్యులందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. వారి అసాధారణ ప్రతిభ, శౌర్యంతో ఎల్లప్పుడూ భారత మాతకు సేవ చేశారు. ఈ పవిత్ర భూమికి ఉజ్వల భవిష్యత్తు, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను’’.


(रिलीज़ आईडी: 2218539) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam