ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 24 JAN 2026 8:50AM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని సుసంపన్నం చేయటంలో యూపీ ప్రజల పాత్ర అమూల్యమైనదని ప్రశంసించారు.

 

అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో తొమ్మిదేళ్లలో ఉత్తరప్రదేశ్‌ను 'బీమారు' రాష్ట్రం నుంచి ఆదర్శవంతమైన రాష్టంగా మార్చిందని ప్రధానమంత్రి తెలిపారు.

 

రాష్ట్ర భవిష్యత్తుపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, దేశాభివృద్ధిని వేగవంతంగా, భవిష్యత్ దిశగా నడిపించటంలో ఉత్తరప్రదేశ్ శక్తి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

 

"ఉత్తరప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా భారతీయ సంస్కృతి, వారసత్వం కోసం అమూల్యమైన కృషి చేసిన నా కుటుంబసభ్యులందరికీ అభినందనలు. అభివృద్ధికి అంకితమైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో తొమ్మిదేళ్లలో బీమారు రాష్ట్రం నుంచి ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారింది. దేశ ప్రగతికి ఉత్తరప్రదేశ్ సామర్థ్యం కీలకమని నేను నమ్ముతున్నాను"


(रिलीज़ आईडी: 2218095) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam