ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు
భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇరు దేశాల నేతలు
వాణిజ్యం,పెట్టుబడి, సాంకేతికత, రక్షణ, ఇంధనం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో గణనీయ పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఇరు దేశాల నేతలు
పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, ప్రాపంచిక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న నేతలు
త్వరలోనే అధ్యక్షుడు లూలాను భారత్‌కు స్వాగతించడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
22 JAN 2026 9:44PM by PIB Hyderabad
ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ అధ్యక్షుడు, గౌరవనీయ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.
భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే సంవత్సరంలో దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం పట్ల ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
గత సంవత్సరం బ్రెజిలియా, దక్షిణాఫ్రికాలో జరిగిన సమావేశాలను గుర్తుచేసుకుంటూ... వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ, ఇంధనం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం సాధించిన గణనీయమైన పురోగతి పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
పరస్పర ప్రయోజనం గల ప్రాంతీయ, ప్రాపంచిక అంశాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడి సవాళ్ల పరిష్కారంలో సంస్కరించిన బహుపాక్షిక ప్రాముఖ్యాన్ని వారు స్పష్టం చేశారు.
అతి త్వరలోనే అధ్యక్షుడు లూలాను భారత్‌కు స్వాగతించడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2217937)
आगंतुक पटल : 2