ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వసంత పంచమి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 JAN 2026 9:25AM by PIB Hyderabad

శుభప్రద వసంత పంచమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతి శోభతో పాటు దివ్యత్వానికి అంకితమైన ఈ పండుగ రోజు ఎంతో పవిత్ర

మైందని ప్రధానమంత్రి అన్నారు. జ్ఞానానికి, కళలకూ అధిదేవత అయిన సరస్వతీ మాత ఆశీర్వాదాలు మన అందరికీ లభించాలని ఆయన ప్రార్థించారు.
దేవీ మాత సరస్వతి అనుగ్రహంతో పౌరులందరి జీవనంలో విద్య, జ్ఞానం, వివేకం ఎల్లకాలం తళుకులీనుతుండాలన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశంలో -
‘‘ప్రకృతి సుందరత్వానికీ, దివ్యత్వానికి అంకితమైన పవిత్ర పర్వదినం ‘వసంత పంచమి’ వేళ.. మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. జ్ఞానానికి, కళలకూ అధిదేవత సరస్వతీ మాత. ఆ దేవీ మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ప్రాప్తించాలని నేను కోరుకుంటున్నాను. ఆ దేవత కృపతో అందరి జీవనంలో విద్య, వివేకం, బుద్ధి ఎల్లవేళలా వికసిస్తూ ఉండాలని నేను అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2217933) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam