ప్రధాన మంత్రి కార్యాలయం
కుమార్తెల ప్రాముఖ్యాన్నీ, శక్తినీ చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
22 JAN 2026 9:26AM by PIB Hyderabad
కుమార్తెలను లక్ష్మీదేవితో సమానంగా భావించి గౌరవించే దేశంలో, బేటీ బచావో బేటీ పఢావో ప్రచార ఉద్యమాన్ని 11 సంవత్సరాల కిందట ఇదే రోజు ప్రారంభించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత్ కుమార్తెలు ప్రతి రంగంలో కొత్త రికార్డులను సృష్టిస్తుండడంతో పాటు, దేశ ప్రగతికి చెప్పుకోదగ్గ తోడ్పాటును అందిస్తుండడం ఎంతో గర్వకారణమైన విషయమని ఆయన అన్నారు.
భారతీయ నాగరికతలో కుమార్తెలకు మొదటి నుంచీ ప్రాముఖ్యాన్ని ఇస్తుండడాన్ని ప్రతిబింబించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. ఆయన ఈ సందర్బంగా -
‘‘దశపుత్రసమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయన్
యత్ ఫలమ్ లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయైకయా’’ అని పేర్కొన్నారు.
ఒక కుమార్తె పది మంది కుమారులతో సమానం.. పది మంది కుమారులను కలిగి ఉన్నందువల్ల ఒక వ్యక్తికి లభించే గుణాన్ని గాని లేదా యోగ్యతను గానీ ఒక కుమార్తెను కలిగి ఉన్న వ్యక్తి కూడా పొందవచ్చు అనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘కన్యను లక్ష్మిగా భావించే మన దేశంలో, 11 సంవత్సరాల కిందట ఇదే రోజు బేటీ బచావో బేటీ పఢావో ఉద్యమం మొదలైంది. ప్రస్తుతం భారత దేశ కుమార్తెలు ప్రతి రంగంలోనూ నిత్యం కొత్త రికార్డులను సృష్టిస్తుండడం ఎంతో గర్వకారణమైన విషయం.
‘‘దశపుత్రసమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయన్
యత్ ఫలమ్ లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయైకయా.’’
***
(रिलीज़ आईडी: 2217302)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam