విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ప్రజల నుంచి సలహాల స్వీకరణకు జాతీయ విద్యుత్ విధానం (ఎన్ఈపీ) ముసాయిదా - 2026 విడుదల
प्रविष्टि तिथि:
21 JAN 2026 9:32AM by PIB Hyderabad
నూతన ‘‘జాతీయ విద్యుత్ విధానం (ఎన్ఈపీ)-2026’’ ముసాయిదాను విడుదల చేసినట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగంలో మార్పులు తీసుకురావడమే ఎన్ఈపీ 2026 ముసాయిదా లక్ష్యం. ఇది ఖరారైతే.. 2005లో నోటిఫై చేసిన ఎన్ఈపీ స్థానంలో అమల్లోకి వస్తుంది.
డిమాండ్-సరఫరా లోటు, పరిమిత విద్యుత్ వసతి, మౌలిక వసతుల లేమితో సహా విద్యుత్ రంగంలో ప్రాథమిక సవాళ్లను పరిష్కరించేందుకు 2005 ఫిబ్రవరిలో మొదటి జాతీయ విద్యుత్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి భారతీయ విద్యుత్ రంగం పురోగమనంలో పయనిస్తోంది. ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ఉత్పత్తి సామర్థ్యం నాలుగు రెట్లు పెరిగింది. మార్చి 2021 నాటికి సార్వత్రిక విద్యుద్దీకరణ సాధ్యమైంది. ఏకీకృత జాతీయ గ్రిడ్ 2013 డిసెంబర్‌లో పనిచేయడం ప్రారంభించింది. 2024-25 నాటికి తలసరి విద్యుత్ వినియోగం 1,460 కిలోవాట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సేకరణ సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని విద్యుత్ మార్కెట్లు, ఎక్స్ఛేంజిలు మెరుగుపరిచాయి.
ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ, పంపిణీ వ్యవస్థలో అధిక నష్టాలు, బకాయిలు లాంటి సవాళ్లు అలాగే ఉన్నాయి. చాలా విభాగాల్లో సుంకాలు.. ఖర్చుల్లో ప్రతిబింబించడం లేదు. అలాగే అధిక క్రాస్ సబ్సిడీల వల్ల పారిశ్రామిక సుంకాలు పెరిగాయి. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పరిశ్రమలు పోటీ పడటంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకమైన ఎన్ఈపీ-2026 ముసాయిదా ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. తలసరి విద్యుత్ వినియోగం 2030 నాటికి 2,000 కిలోవాట్లకు, 2047 నాటికి 4,000 కిలోవాట్లకు చేర్చాలనేది ఈ విధానం లక్ష్యం. అదే విధంగా, 2005తో పోలిస్తే 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడం, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడంతో సహా భారత పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ విధానం ఉంది. ఇది తక్కువ కర్భన ఉద్గారాలు వెలువడే విద్యుత్ మార్గాల దిశగా నిర్ణయాత్మక మార్పును తప్పనిసరి చేస్తుంది.
ఎన్ఈపీ-2026 ముసాయిదాలో పేర్కొన్న ప్రధాన కార్యక్రమాలు:
-
సమృద్ధిగా వనరులు (ఆర్ఏ):
-
వికేంద్రీకృత ముందస్తు ప్రణాళిక ద్వారా అవసరమైన సామర్థ్య విస్తరణను సాధించడానికి రాష్ట్రాల కమిషన్ల నిబంధనలకు అనుగుణంగా.. వినియోగ, రాష్ట్ర స్థాయుల్లో ఆర్ఏ ప్రణాళికలను డిస్కమ్‌లు, ఎస్‌ఎల్‌డీసీలు రూపొందిస్తాయి. జాతీయ స్థాయిలో వనరుల సమృద్ధికి భరోసా ఇచ్చేలా జాతీయ స్థాయి ప్రణాళికలను సీఈఏ సిద్ధం చేస్తుంది.
-
ఆర్థిక ఆచరణ, ఆర్థిక పోటీతత్వం:
-
రాష్ట్ర కమిషన్ ఎలాంటి పన్ను ఉత్తర్వులు జారీ చేయని సందర్భంలో సుంకాలను స్వయంచాలకంగా వార్షిక సవరణ చేసేలా తగిన సూచికలకు అనుసంధానించాలి.
-
పన్ను విభాగాలు, వివిధ వర్గాల వినియోగదారుల మధ్య క్రాస్ సబ్సిడీలను నివారించడానికి డిమాండు చార్జీల ద్వారా స్థిర వ్యయాలను సుంకాల ద్వారా తిరిగి రాబట్టుకోవాలి.
-
భారతీయ ఉత్పత్తుల ఆర్థిక పోటీతత్వాన్ని పెంపొందించేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు తయారీ రంగ పరిశ్రమలు, రైల్వేలు, మెట్రో రైల్వేలకు క్రాస్-సబ్సిడీలు, సర్‌చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలి.
-
సంబంధిత ప్రభుత్వాలను సంప్రదించిన అనంతరం ఒక మెగావాట్, అంతకంటే ఎక్కువ కాంట్రాక్టు లోడ్ ఉన్న వినియోగదారులకు సంబంధించి పంపిణీ లైసెన్సుదారులకు సార్వత్రిక సేవా భారం నుంచి నియంత్రణ కమిషన్లు మినహాయింపు ఇవ్వొచ్చు.
-
నియంత్రణ కమిషన్లపై భారాన్ని తగ్గించేందుకు, వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు, వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వివాద పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలి.
-
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, నిల్వ:
-
మార్కెట్ ఆధారిత వ్యవస్థలు, సొంత విద్యుత్ కేంద్రాల ద్వారా పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం.
-
చిన్న వినియోగదారులకు అధిక మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల కలిగే ధరల ప్రయోజనాన్ని అందించేందుకు వారి తరఫున లైసెన్సు పొందిన వారే నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేస్తాయి. అలాగే టోకు వినియోగదారులు నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా డిస్ట్రిబ్యూటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ (డీఆర్ఈ) స్వీకరణను సులభతరం చేయవచ్చు.
-
డీఆర్ఈ నుంచి లభించే మిగులు విద్యుత్తును వినియోగదారులు తామే స్వయంగా (పీ2పీ) లేదా అగ్రిగేటర్ల ద్వారా విక్రయించవచ్చు లేదా నిల్వ చేసుకోవచ్చు.
-
2030 నాటికి షెడ్యూలింగ్, వ్యత్యాసాల నిర్వహణలో పునరుత్పాదక విద్యుత్తు, సంప్రదాయ వనరుల మధ్య సమానత్వం తీసుకురావడం.
-
మార్కెట్ ఆధారిత నిల్వ వ్యూహం, బ్యాటరీ విద్యుత్ నిల్వ వ్యవస్థ (బీఈఎస్ఎస్) సాంకేతికతల వినియోగం, దేశీయంగా బీఈఎస్ఎస్ బ్యాటరీలు, ఇతర పరికరాలను తయారు చేయడం, బీఈఎస్ఎస్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కోసం వీజీఎఫ్ లాంటి డిమాండు ఆధారిత ప్రోత్సాహకాలను అందించడం.
4. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
-
పెద్ద మొత్తంలో పునరుత్పాదక విద్యుత్తును అనుసంధానించేందుకు వీలుగా గ్రిడ్‌కు తోడ్పాటకు అందించేందుకు నిల్వ ఏకీకరణ, పాత యూనిట్ల పునరుద్ధరణ.
-
కేంద్రీయ కూలింగ్ వ్యవస్థ లేదా గరిష్ఠ వినియోగం కోసం పారిశ్రామిక పద్ధతులు వంటి అనువర్తనాల్లో థర్మల్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే ఆవిరిని నేరుగా ఉపయోగించుకునే అవకాశాల అన్వేషణ.
-
అణు విద్యుత్ ఉత్పత్తి:
-
2047 నాటికి 100 గిగావాట్లను సాధించడానికి శాంతి చట్టం-2025లోని నిబంధనలకు అనుగుణంగా అధునాతన అణు సాంకేతికతల స్వీకరణ, మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి, చిన్న రియాక్టర్ల ఏర్పాటు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు అణు విద్యుత్తును వినియోగించుకోవడం.
-
జల విద్యుత్ ఉత్పత్తి:
-
వరద ప్రభావ నియంత్రణ, సాగునీరు, నీరు, విద్యుత్ భద్రత కోసం నిల్వ ఆధారిత జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేయడం.
-
విద్యుత్ మార్కెట్లు:
-
సరఫరా:
-
రైట్ ఆఫ్ వే (ఆర్వోడబ్ల్యూ) సవాళ్లను పరిష్కరించడానికి ఆధునిక సాంకేతికతల స్వీకరణ, తగినంత భూ వినియోగ పరిహారం చెల్లింపు.
-
2030 నాటికి అన్ని రకాల నూతన పునరుత్పాదక విద్యుత్ సరఫరా ఛార్జీలను సంప్రదాయక విద్యుత్ టారిఫ్‌లతో సమానంగా తీసుకురావడం.
-
గరిష్ట వినియోగాన్ని నిర్ధారించడానికి, ఊహాజనిత నిల్వను నిరోధించడానికి సరైన నియంత్రణా వ్యవస్థలతో పాటుగా.. సరఫరా అనుసంధానానికి వినియోగ ఆధారిత నియమాల ఏర్పాటు.
-
పంపిణీ:
-
ఏటీ అండ్ సీ నష్టాలను సింగిల్ డిజిట్‌కు తగ్గించేలా చర్యలు.
-
నెట్వర్క్ పునరావృతం కాకుండా చూసుకుంటూనే పోటీని, సామర్థ్యాన్ని పెంపొందించేలా ఉమ్మడి పంపిణీ వ్యవస్థల ఏర్పాటు.
-
ఉమ్మడి వ్యవస్థ, పునరుత్పాదక పంపిణీ ఏకీకరణ, నిల్వ, వాహనం నుంచి గ్రిడ్ (వీ2జీ) వ్యవస్థలను సులభతరం చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆపరేటర్ (డీఎస్ఓ) ఏర్పాటు.
-
2032 నాటికి 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని నగరాల్లోనూ ట్రాన్స్ఫార్మర్ స్థాయి పంపిణీలో లో ఎన్-1 అదనపు సౌకర్యాల ఏర్పాటు(రిడెండెన్సీ). ఇలాంటి నగరాల్లో ఇరుకు ప్రాంతాల్లో పంపిణీ వ్యవస్థను భూగర్భంలోకి మార్చేందుకు పరిగణన.
-
గ్రిడ్ కార్యకలాపాలు
-
ఎస్ఎల్‌డీసీ కార్యకలాపాలను నిర్వహించడానికి, సరఫరా ప్రణాళికలను చేపట్టడానికి రాష్ట్ర సరఫరా సంస్థ (ఎస్‌టీయూ)ల క్రియాత్మక విభజన, రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం.
-
సీఈఆర్‌సీ నిర్దేశించిన ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్‌కు అనుగుణంగా రాష్ట్ర గ్రిడ్ కోడ్‌లు.
-
సైబర్ భద్రత
-
విస్తృతమైన సైబర్ భద్రతా విధానం ఏర్పాటు.
-
డేటా సార్వభౌమత్వాన్ని, వ్యవస్థ స్థిరత్వానికి హామీ ఇచ్చేలా విద్యుత్ రంగ సమాచారాన్ని భారత్‌లోనే నిల్వ చేయడం తప్పనిసరి.
-
డేటా షేరింగ్:
-
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ఆధారంగా కార్యనిర్వాహక, మార్కెట్ సమాచారం పంచుకోవడం.
-
డిస్కంలు, ఎస్ఎల్డీసీలకు పంపిణీ చేసి విద్యుత్ వనరుల సమచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం.
-
సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి:
-
వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా.. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్తును చౌక ధరలకు అందించడానికి భవిష్యత్తుకు అనుగుణమైన, ఆర్థికంగా లాభదాయకమైన, పర్యావరణపరంగా సుస్థిరమైన విద్యుత్ రంగానికి అవసరమైన నమూనాను ఎన్ఈపీ-2026 ముసాయిదా అందిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2217115)
आगंतुक पटल : 2