భారత ఎన్నికల సంఘం
ప్రారంభమైన ఐఐసీడీఈఎం-2026 సదస్సు
వివిధ దేశాల ప్రతినిధి బృందాల అధిపతులకు అధికారికంగా స్వాగత వేడుక నిర్వహించిన ఈసీఐ..
"ఇండియా డిసైడ్స్" డాక్యుమెంటరీ సిరీస్ ప్రదర్శన
प्रविष्टि तिथि:
21 JAN 2026 3:35PM by PIB Hyderabad
1. న్యూఢిల్లీలోని భారత మండపంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల నిర్వహణ (ఐఐసీడీఈఎం)-2026 అంశంపై మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు ఇవాళ ప్రారంభమైంది.
2. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) శ్రీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు (ఈసీలు) డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి దాదాపు 60 మంది అంతర్జాతీయ ప్రతినిధులకు ఘనస్వాగతం పలికారు.
3. వైభవంగా జరిగిన సదస్సు ప్రారంభ వేడుకలో సుమారు 1,000 మంది అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 42 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు (ఈఎంబీలు), 27 దేశాల రాయబారులు, హై కమిషనర్లు, 70కి పైగా జాతీయ సంస్థల నిపుణులు హాజరయ్యారు. ఈసీఐ ఉన్నతాధికారులు, దేశవ్యాప్తంగా 36 మంది ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓలు) ఈ సమావేశంలో పాల్గొన్నారు.
4. కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలికిన సీఈసీ శ్రీ జ్ఞానేశ్ కుమార్.. కొన్ని దశాబ్దాలుగా ఈఎంబీల పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. 150 కోట్ల జనాభాతో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ఎన్నికలను నిర్వహిస్తుందని వివరించారు.
5. పౌరులు ఈఎంబీలపై ఉంచిన నమ్మకం అత్యంత విలువైనదని ఈసీ డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు అన్నారు. ప్రతి ఎన్నికకు పౌరులే కీలకమని, తన ఓటును గౌరవిస్తారనే నమ్మకం పౌరులకు ఉంటుందని, ఆ నమ్మకాన్ని కాపాడటం ఈఎంబీల ఉమ్మడి బాధ్యతని తెలిపారు.
6. సమావేశం ప్రారంభంలో ఈసీ డాక్టర్ వివేక్ జోషి మాట్లాడుతూ.. ఈఎంబీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులను ఐఐసీడీఈఎం-2026 సదస్సు ఒకచోటకు చేర్చిందన్నారు. వీళ్లంతా విభిన్న కోణాల నుంచి ఎన్నికల ప్రక్రియను పరిశీలించి, ఆయా సంస్థల అభివృద్ధికి సహకరిస్తారని చెప్పారు.
7. ఐఐసీడీఈఎం-2026 ఇతివృత్తంపై ఐఐఐడీఈఎం డైరెక్టర్ జనరల్ శ్రీ రాకేశ్ వర్మ మాట్లాడారు. భారత్ ఎంచుకున్న సమ్మిళిత, శాంతియుత, స్థితిస్థాపకత గల, స్థిరమైన ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం అనే ఇతివృత్తం.. 21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం సాధించాల్సిన అంశంపై విస్తృతమైన, వివిధ కోణాల్లో అవగాహనను ప్రతిబింబిస్తుందన్నారు.
8. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సహకారంతో నిర్మించిన ఇండియా డిసైడ్స్ డాక్యుమెంటరీ సీరిస్ కు సంబంధించిన విశేషాలను కార్యక్రమంలో పాల్గొన్నవారు వీక్షించారు. ఈ సందర్భంగా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అర్జున్ నోహ్వార్ మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన బాధ్యతల్లో ఒకదాన్ని నిర్వహించే సంస్థ పనితీరు ఆధారంగా, సాధారణ ఎన్నికలను ఆకట్టుకునే దృశ్యాలతో ఈ డాక్యుమెంటరీ సిరీస్ ప్రభావవంతంగా చిత్రీకరించినట్లు చెప్పారు.
***
(रिलीज़ आईडी: 2217113)
आगंतुक पटल : 10