సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
రామ కథా మ్యూజియానికి కానుకగా 233 ఏళ్ల నాటి వాల్మీకి రామాయణం
प्रविष्टि तिथि:
20 JAN 2026 5:53PM by PIB Hyderabad
ఒక చరిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 233 సంవత్సరాల నాటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్త్వదీపికాటికతో కూడినది) సంస్కృత తాళపత్ర గ్రంథాన్ని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి... తీన్ మూర్తిలోని ప్రధానమంత్రుల మ్యూజియం, లైబ్రరీ కార్యనిర్వాహక మండలి చైర్మన్ శ్రీ నృపేంద్ర మిశ్రాకు అందజేశారు.
ఆదికవి వాల్మీకి రచించిన, మహేశ్వర తీర్థుని శాస్త్రీయ వ్యాఖ్యానంతో కూడిన ఈ తాళపత్ర గ్రంథం సంస్కృత భాషలో (దేవనాగరి లిపిలో) రాసినది. ఇది విక్రమ సంవత్సరం 1849 (క్రీ.శ. 1792) నాటి చరిత్రక ప్రాముఖ్యం గల రచన. అరుదైన, భద్రపరచిన రామాయణ గ్రంథ సంప్రదాయాన్ని ఇది సూచిస్తుంది. ఈ సంకలనం ఇతిహాసపు కథనం, తాత్విక లోతును ప్రతిబింబించే బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే ఐదు ప్రధాన కాండాలను కలిగి ఉంది.
గతంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు తాత్కాలికంగా అప్పగించిన ఈ చేతిరాత ప్రతిని, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న అంతర్జాతీయ రామ కథా సంగ్రహాలయానికి శాశ్వత కానుకగా అందజేశారు. ఈ ముఖ్యమైన చర్య... రామాయణ వారసత్వానికి ప్రపంచ కేంద్రంగా మ్యూజియం అభివృద్ధి చెందటానికి తోడ్పడుతుంది. తద్వారా అనేక మంది ప్రజలకు అందుబాటులోకి రావడంతో పాటుగా దాని పరిరక్షణనూ ఇది నిర్ధారిస్తుంది.
ప్రొఫెసర్ వరఖేడి ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఈ కానుక వాల్మీకి రామాయణంలోని అపార జ్ఞానాన్ని శాశ్వతం చేస్తుంది. తద్వారా అయోధ్య పవిత్ర నగరాన్ని సందర్శించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులకు, భక్తులకు, సందర్శకులకు ఇది అందుబాటులోకి వస్తుంది" అని అన్నారు.
పీఎంఎంఎల్ కార్యనిర్వాహక మండలి ఛైర్మన్ శ్రీ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ "వాల్మీకి రామాయణానికి చెందిన ఈ అరుదైన తాళపత్ర గ్రంథాన్ని అయోధ్యలోని రామ కథా సంగ్రహాలయానికి విరాళంగా ఇచ్చే ఈ సందర్భం... శ్రీరామ భక్తులకు, అయోధ్యలోని ఆలయ సముదాయానికి ఒక చారిత్రాత్మక ఘట్టం" అని వ్యాఖ్యానించారు.
****
(रिलीज़ आईडी: 2216741)
आगंतुक पटल : 9