ప్రధాన మంత్రి కార్యాలయం
భారతరత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 JAN 2026 10:17AM by PIB Hyderabad
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ (ఏంజీఆర్) జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
ఓ ప్రకటనలో ఎంజీఆర్ బహుముఖ వారసత్వాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. తమిళనాడు సామాజిక, ఆర్థిక పురోగతికి ఆయన అందించిన సేవలు అపూర్వమైనవని అన్నారు. తమిళ సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషిని ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వేర్వేరు పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తున్నాను. తమిళనాడు పురోగతికి ఆయన చేసిన సేవలు అపూర్వమైనవి. అలాగే తమిళ సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్ర కూడా అంతే విశిష్టమైనది. మన సమాజం కోసం ఆయనకున్న దార్శనికతను సాకారం చేయడానికి మేం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాం’’.
***
(रिलीज़ आईडी: 2215584)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam