ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల 28వ సమావేశాన్ని ఉద్దేశించి సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో తాను ఇచ్చిన ఉపన్యాసం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
15 JAN 2026 10:23PM by PIB Hyderabad
కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల 28వ సమావేశాన్ని ఈ రోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ఇచ్చిన ఉపన్యాసం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ -
‘‘న్యూఢిల్లీలో నిర్వహించిన కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల 28వ సమావేశంలో భారత్ ప్రజాస్వామిక సంప్రదాయాలను ప్రపంచ వేదిక మీద పంచుకోవడం మరపురాని అనుభవం’’.
‘‘ప్రజాస్వామిక స్ఫూర్తి మన నరాల్లో, మన మనసులో, మన సంస్కారాల్లో ఇమిడిపోయింది. మరి ఈ సంస్కారాలు మన ప్రజాస్వామ్యం నుంచే మనకు అలవడ్డాయి’’.
‘‘ఇవాళ ప్రపంచం ఇదివరకు ఎప్పుడూ ఎరుగని పరివర్తన కాలం గుండా పయనిస్తోంది.. ఇలాంటి నేపథ్యంలో, భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల్ని పరిరక్షించడాన్ని గురించి తన వాణిని ప్రతి వేదిక మీదా బలంగా వినిపిస్తోంది’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2215222)
आगंतुक पटल : 2