లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

2026 జనవరి 14 నుంచి 16 వరకు ఢిల్లీలో 8వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (సీఎస్‌పీఓసీ)

प्रविष्टि तिथि: 12 JAN 2026 6:15PM by PIB Hyderabad

ఢిల్లీ, 2026 జనవరి 12: 2026 జనవరి 14 నుంచి 16 ఢిల్లీలో నిర్వహించనున్న 28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు‌కు (సీఎస్‌పీఓసీ) భారత పార్లమెంట్ ఆతిథ్యం ఇవ్వనుంది. 

2026 జనవరి 15న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని పార్లమెంట్ భవన సముదాయంలో ఉన్న సంవిధాన్ సదన్‌కు చెందిన చారిత్రాత్మక సెంట్రల్ హాల్‌లో ఈ సదస్సును ప్రారంభించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సాదరంగా అంగీకరించారు. 

భారత పార్లమెంట్ చివరిసారిగా అక్టోబర్ 2023లో నిర్వహించిన ఇంటర్- పార్లమెంటరీ సమావేశమైన 9వ జీ20 పార్లమెంటరీ స్పీకర్ల (పీ20) సదస్సును కూడా గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రారంభించారు.

లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఈ సదస్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. 

సీఎస్‌పీఓసీ:

1969లో అప్పటి కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లూసియన్ లామౌరెక్స్ చొరవతో కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (సీఎస్‌పీఓసీ) ప్రారంభమైంది. 

సీఎస్‌పీఓసీ ప్రారంభమైనప్పటి నుంచి దీని కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు కెనడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. 

కామన్వెల్త్‌లోని సార్వభౌమ దేశాలకు చెందిన 53 జాతీయ పార్లమెంట్ల స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లను సీఎస్‌పీఓసీ ఒకచోట చేరుస్తుంది. 

కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ), కామన్వెల్త్ సెక్రటేరియట్ లేదా కామన్వెల్త్ ప్రభుత్వాధినేతలతో (సీహెచ్ఓజీఎం) ఎలాంటి అధికారిక అనుబంధం లేని స్వతంత్ర వ్యవస్థ సీఎస్‌పీఓసీ. దీని సభ్యత్వం సీపీఓ సభ్యత్వానికి అనుగుణంగా ఉంటుంది. 

ఈ సదస్సు లక్ష్యాలు:

* పార్లమెంట్‌ల స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల విషయంలో నిష్పక్షపాతం- న్యాయబద్ధతను కొనసాగించడం, పెంపొందించడం, ప్రోత్సహించటం

* పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఉన్న వివిధ రూపాల గురించి విజ్ఞానం, అవగాహనను ప్రోత్సహించడం

 * పార్లమెంటరీ సంస్థలను అభివృద్ధి చేయడం

సీఎస్‌పీఓసీ రెండేళ్ల వ్యవధితో పనిచేస్తుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి.. సాధారణంగా జనవరి ప్రారంభంలో పూర్తి సభ్యులతో సమావేశాన్ని నిర్వహిస్తుంది. మధ్యలో వచ్చే ఏడాది అదే సమయంలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తుంది.

భారత్‌లో 28వ సీఎస్‌పీఓసీ సదస్సును నిర్వహించాలనే నిర్ణయం

2020 జనవరి 5 నుంచి 9 వరకు ఒట్టావాలో జరిగిన 25వ సీఎస్‌పీఓసీ సదస్సు సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో (ఎంఈఓ) సంప్రదింపులు చేపట్టి 28వ సదస్సును భారత్‌లో నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఈ సదస్సులోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి (ఐపీడీ) నాయకత్వం వహించారు.

ఉగాండా పార్లమెంటు ఆధ్వర్యంలో 2024 జనవరి 4 నుంచి 6 వరకు కంపాలాలో జరిగిన 27వ సీఎస్‌పీఓసీ ముగింపు సందర్భంగా ఈ సదస్సులోని భారత ప్రతినిధి బృంద నాయకుడైన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్.. 2026లో భారత్‌లో జరగనున్న 28వ సీఎస్‌పీఓసీ నిర్వాహక బాధ్యతలను ఉగాండా నుంచి స్వీకరించారు.

28వ సీఎస్‌పీఓసీ కార్యక్రమాలు 

కార్యక్రమ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

స్టాండింగ్ కమిటీ సమావేశం – 2026 జనవరి 14

సీఎస్‌పీఓసీ కార్యకలాపాలను స్టాండింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇందులో 15 సభ్య దేశాలు ఉంటాయి. ఇందులో 5 మంది సభ్యులు కోరంగా పరిగణిస్తారు. 

28వ సీఎస్‌పీఓసీ అధ్యక్షుడిగా లోక్‌సభ స్పీకర్ 2026 జనవరి 14న సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీలోని ఎర్రకోటలో ఉన్న సంగీతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరగనున్న సీఎస్‌పీఓసీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. 

సమావేశానికి ముందు స్టాండింగ్ కమిటీలో భాగంగా ఉన్న స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు అప్పటి వరకు ఢిల్లీకి చేరుకునే (సుమారు 40 దేశాలు) ప్రతినిధుల కోసం ఎర్రకోట సందర్శనను ఏర్పాటు చేశారు. 

వారికోసం ఎర్రకోటలో లైట్- సౌండ్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. 

స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం వారి గౌరవార్థం ఎర్రకోట ప్రాంగణంలోనే రాత్రి 7:30 గంటలకు లోక్‌సభ స్పీకర్ విందు ఇస్తారు.

28వ సీఎస్‌పీఓసీ ప్రారంభోత్సవం – 2026 జనవరి 15 

28వ సీఎస్‌పీఓసీ ప్రారంభోత్సవ వేడుక ఢిల్లీలోని పార్లమెంట్ భవన సముదాయంలో ఉన్న సంవిధాన్ సదన్‌కు చెందిన చారిత్రాత్మక సెంట్రల్ హాల్‌లో ఉదయం 10:30 గంటలకు జరుగుతుంది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సదస్సును ప్రారంభించేందుకు, ఈ సందర్భంగా కీలకోపన్యాసం ఇచ్చేందుకు అంగీకరించారు. ప్రారంభోత్సవ వేడుక తర్వాత గౌరవనీయ ప్రధానమంత్రి కామన్వెల్త్, స్వయంప్రతిపత్తి కలిగిన దేశాల పార్లమెంట్ల స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లతో అనధికారికంగా మాట్లాడనున్నారు.. ఈ సందర్భంగా ఆయన వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు.

సదస్సులోని అంశాలు

28వ సీఎస్‌పీఓసీ ఈ క్రింది ఎజెండా అంశాలపై దృష్టి సారిస్తుంది:

నాలుగు వర్క్‌షాప్ సెషన్ల అంశాలు

* పార్లమెంటులో ఏఐ (కృత్రిమ మేధ): ఆవిష్కరణ, పర్యవేక్షణ, అనుసరణ మధ్య సమతుల్యతను సాధించడం.

* సామాజిక మాధ్యమాలు, పార్లమెంటేరియన్లపై దాని ప్రభావం. 

* ఓటింగ్‌కు అతీతంగా పార్లమెంట్‌పై ప్రజా అవగాహన, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నూతన వ్యూహాలు.

* పార్లమెంటు, పార్లమెంటరీ అధికారుల భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు. 

2026 జనవరి 15న మొదటి రెండు అంశాలపై చర్చ జరుగుతుంది.

2026 జనవరి 16న మిగిలిన రెండు అంశాలపై చర్చిస్తారు.

ప్రత్యేక ప్లీనరీ సెషన్ అంశం

బలమైన ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర.

2026 జనవరి 15, 16లలో జరిగే ప్లీనరీ సమావేశాలకు అధ్యక్షత వహించడంతో పాటు లైట్నింగ్ రౌండ్, స్పెషల్ ప్లీనరీ, ముగింపు ప్లీనరీలకు అధ్యక్షత వహించే అవకాశం కూడా లోక్‌సభ స్పీకర్‌కు లభిస్తుంది. 'బలమైన ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర' అనే ప్రత్యేక ప్లీనరీ అంశంపై ఆయన కీలకోపన్యాసం చేస్తారు.

గతంలో భారత్‌లో జరిగిన ‘సీఎస్‌పీఓసీ’లు:

ఇప్పటివరకు మూడుసార్లు సీఎస్‌పీఓసీకి భారత పార్లమెంట్‌ ఆతిథ్యం ఇచ్చింది:

* 1971లో ఢిల్లీలో జరిగిన 2వ సీఎస్‌పీఓసీ

* 1986 జనవరి 6 నుంచి 8 వరకు ఢిల్లీలో జరిగిన 8వ సీఎస్‌పీఓసీ

* 2010 జనవరి 4 నుంచి 8 వరకు ఢిల్లీలో జరిగిన 20వ సీఎస్‌పీఓసీ: 2010లో జరిగిన 20వ సీఎస్‌పీఓసీకి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా నిలిచింది. అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 2010 సీఎస్‌పీఓసీని ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు.

ప్రతినిధుల స్వాగతం

కామన్వెల్త్, స్వయం ప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల స్పీకర్లు- ప్రిసైడింగ్ ఆఫీసర్లు, వారితో వచ్చే ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్న వెంటనే వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మన 'అతిథి దేవో భవ' నినాదానికి అనుగుణంగా వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకనున్నారు. 

సీఎస్‌పీఓసీ అధ్యక్ష పదవి

ప్రతి సదస్సు ముగింపులో తదుపరి సదస్సుకు సంబంధించిన వేదిక ఖరారైనప్పుడు.. సంబంధిత కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యం ఇచ్చే స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టాండింగ్ కమిటీ అధ్యక్ష పదవిని చేపడతారు. 

దీని ప్రకారమే జనవరి 2024లో ఉగాండాలో జరిగిన 27వ విడత సదస్సు ముగింపు నుంచి లోక్‌సభ స్పీకర్ సీఎస్‌పీఓసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 

2026 జనవరి 16న ఢిల్లీలో జరిగే 28వ సీఎస్‌పీఓసీ ముగింపులో ఈ సదస్సు అధ్యక్ష బాధ్యతలను యూకే హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ సర్ లిండ్సే హోయిల్‌కు లోక్‌సభ స్పీకర్ అప్పగిస్తారు. 

సీఎస్‌పీఓసీ‌కి హాజరయ్యే వారు

సీఎస్‌పీఓసీలో 53 కామన్వెల్త్ దేశాల పార్లమెంట్ల స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొంటారు (జాబితాలో ఉంది). 

వీటిలో 23 ద్విసభా పార్లమెంట్లు, 30 ఏకసభా పార్లమెంట్‌లు ఉన్నాయి. 

* మొత్తం స్పీకర్లు లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సంఖ్య - 76

* మొత్తం క్లర్కులు, సెక్రటరీ జనరల్‌ల సంఖ్య - 71.

పాల్గొనే ఇతరుల్లో 14 పాక్షిక-స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్‌ల ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సీపీఓ సెక్రటరీ జనరల్, వారితో వచ్చే అధికారులు సాధారణంగా ఉంటారు. ప్రతి సీఎస్‌పీఓసీకి పరిశీలకులుగా క్రమం తప్పకుండా అహ్వానం అందుకునే 14 పాక్షిక-స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్‌లు: ఆల్డెర్నీ, అంగుయిలా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, ఫాక్లాండ్ ఐలాండ్స్, జిబ్రాల్టర్, గ్వెర్న్సీ, ఐల్ ఆఫ్ మ్యాన్, జెర్సీ, మాంట్సెరాట్, నియు, సెయింట్ హెలీనా సౌత్ అట్లాంటిక్, టర్క్స్ అండ్ కైకోస్. 

2025 జనవరిలో సీఎస్‌పీఓసీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన లోక్‌సభ స్పీకర్

28వ సీఎస్‌పీఓసీ నిర్వాహకుడిగా 2025 జనవరి 10న గ్వెర్న్సీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించే గౌరవం లోక్‌సభ స్పీకర్‌కు దక్కింది. 

2026 జనవరి‌లో భారత్‌లో జరగనున్న 28వ సీఎస్‌పీఓసీ తేదీలు, ఎజెండా అంశాలను ఖరారు చేయాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. 

28వ సీఎస్‌పీఓసీ తేదీలు

జనవరి నెలలోనే సీఎస్‌పీఓసీని నిర్వహించే ఆనవాయితీని కొనసాగిస్తూ 2026 జనవరి 14-16 మధ్య 28వ సీఎస్‌పీఓసీకి భారత పార్లమెంట్‌ ఆతిథ్యం ఇస్తోంది. 

28వ సీఎస్‌పీఓసీ ప్రారంభోత్సవ వేడుక 2026 జనవరి 15న గురువారం నాడు జరుగుతుంది. 

ఈ సదస్సులో ప్రధానంగా ఈ క్రింది సమావేశాలు ఉంటాయి:

* 1వ రోజు (2026 జనవరి 14, బుధవారం): ప్రతినిధుల రాక, 15 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లతో కూడిన స్టాండింగ్ కమిటీ సమావేశం.

* 2వ రోజు (2026 జనవరి 15, గురువారం): ప్రారంభోత్సవ వేడుక. తదనంతరం.. వర్క్‌షాప్ అంశాలు ఏ, బీలపై ఓపెనింగ్ ప్లీనరీలు ఉంటాయి. ఆపై సమాంతర వర్క్‌షాప్ సెషన్లు, సాంస్కృతిక కార్యక్రమం, విదేశీ స్పీకర్లు -  ఆహ్వానితుల కోసం లోక్‌సభ స్పీకర్ ఇచ్చే విందు. 

* 3వ రోజు (2026 జనవరి 16, శుక్రవారం): వర్క్‌షాప్ అంశాలు సీ, డీలపై ఓపెనింగ్ ప్లీనరీ. ఆపై సమాంతర వర్క్‌షాప్ సెషన్లు, భారత ఉపరాష్ట్రపతి ఇచ్చే విందు, లైట్నింగ్ రౌండ్, స్పెషల్ ప్లీనరీ సెషన్,ముగింపు ప్లీనరీ.

* 4, 5వ రోజులు (2026 జనవరి 17-18): సదస్సు అనంతరం జైపూర్ పర్యటన.

* 18 జనవరి 2026న తిరిగి ఢిల్లీ చేరుకున్న తర్వాత ప్రతినిధుల బృందాలు స్వదేశాలకు బయలుదేరుతాయి.

28వ సీఎస్‌పీఓసీ వేదిక

* ఢిల్లీలోని పార్లమెంట్ భవన సముదాయం ఈ సదస్సుకు వేదికగా ఉంటుంది.

* ప్రారంభోత్సవ వేడుక, ప్లీనరీ సమావేశాలు సంవిధాన్ సదన్‌లోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్‌లో జరుగుతాయి. 

* వర్క్‌షాప్ సెషన్లను సంవిధాన్ సదన్‌లోని లోక్‌సభ చాంబర్, రాజ్యసభ చాంబర్, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌లలో నిర్వహించనున్నారు. 

* జనవరి 14న జరిగే సీఎస్‌పీఓసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జరుగుతుంది. ఆపై అక్కడే విందు ఏర్పాటు చేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి ముందు అప్పటికే ఢీల్లీకి చేరుకున్న ఈ కమిటీలోని సభ్యులైన స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతరులు ఎర్రకోటను సందర్శిస్తారు. వారు అక్కడ లైట్ అండ్ సౌండ్ కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తారు. 

28వ సీఎస్‌పీఓసీకి ప్రత్యేక ఆహ్వానితులు

* డాక్టర్ తూలియా అక్సన్, అధ్యక్షురాలు, ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ)

 * డాక్టర్ క్రిస్టోఫర్ కలిలా, ఛైర్‌పర్సన్, కామన్వెల్త్-పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ)

సదస్సు అనంతరం జైపూర్ పర్యటన

సీఎస్‌పీఓసీ సంప్రదాయంలో భాగంగా 2026 జనవరి 17, 18 తేదీలలో విదేశీ ప్రతినిధుల కోసం జైపూర్‌ పర్యటనను ఏర్పాటు చేశారు. 

రాజస్థాన్ ప్రభుత్వ సహకారంతో లోక్‌సభ స్పీకర్ ప్రతినిధుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 

ప్రతినిధులు జనవరి 17న విమానంలో జైపూర్ వెళ్తారు. తిరిగి జనవరి 18న ఢిల్లీకి చేరుకుంటారు. 

28వ సీఎస్‌పీఓసీ విశేషాలు (6 జనవరి 2026 నాటికి)

* హాజరుకానున్నట్లు తెలియజేసిన సీఎస్‌పీఓసీ దేశాలు, స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్‌ల స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు: 59

* లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌తో కలిపి మొత్తం పాల్గొనే స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సంఖ్య: 61

* ఈ 61 మందిలో 44 మంది స్పీకర్లు, 15 మంది డిప్యూటీ స్పీకర్లు

* 44 మంది స్పీకర్లలో 41 మంది సీఎస్‌పీఓసీ దేశాల నుంచి కాగా నలుగురు స్వయంప్రతిపత్తి పార్లమెంట్‌లకు  చెందిన వారు. 

* భారత్‌తో కలిపి సీఎస్‌పీఓసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు: 41 ఆంటిగ్వా - బార్బుడా, ఆస్ట్రేలియా, బెలిజ్, బోట్స్వానా, కామెరూన్, కెనడా, డొమినికా, ఫిజి, గయానా, ఘనా, గ్రెనడా, జమైకా, కెన్యా, కిరిబాటి, లెసోతో, మలావి, మలేషియా, మాల్దీవులు, మాల్టా, మారిషస్, మొజాంబిక్, నమీబియా, నౌరు, నైజీరియా, పపువా న్యూ గినియా, రువాండా, సెయింట్ కిట్స్ - నెవిస్, సీషెల్స్, సియెర్రా లియోన్, సింగపూర్, సోలమన్ దీవులు, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజానియా, ది బహామాస్, టోంగా, ట్రినిడాడ్ - టొబాగో, తువాలు, యునైటెడ్ కింగ్‌డమ్, జాంబియా.

* పాల్గొననున్న పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగి పార్లమెంట్‌లు: 4 గ్వెర్న్సీ, ఐల్ ఆఫ్ మ్యాన్, జెర్సీ, మోంట్సెరాట్

పాల్గొనున్నట్లు తెలియజేసిన ప్రత్యేక ఆహ్వానితులు

* డాక్టర్ తులియా అక్సన్,  అధ్యక్షుడు, ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ)

* డాక్టర్ క్రిస్టోఫర్ కలిలా, చైర్‌పర్సన్, కామన్వెల్త్-పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ)

హాజరు కాలేకపోతున్న సీఎస్‌పీఓసీ పార్లమెంట్‌లు

1. బార్బడోస్

2. బెర్ముడా

3. సైప్రస్

4. న్యూజిలాండ్

5. ఉగాండా

6. సెయింట్ విన్సెంట్ - గ్రెనడైన్స్

7. వనువాటు

8. ఎస్వాటిని

ఇంకా నిర్ణయాన్ని తెలియజేయాల్సిన పార్లమెంట్

1. సమోవా

హాజరు కాలేకపోతున్న పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్‌లు 

1. బ్రిటిష్ వర్జిన్ దీవులు

2. ఫాక్లాండ్ దీవులు

3. జిబ్రాల్టర్

4. నియు

5. సెయింట్ హెలెనా

నిర్ణయాన్ని ఇంకా తెలియజేయాల్సిన పార్లమెంట్‌లు

1. ఆల్డెర్నీ

2. అంగుయిలా

3. కేమాన్ దీవులు

4. కుక్ దీవులు

5. టర్క్స్ - కైకోస్

* మొత్తం ప్రతినిధుల సంఖ్య - 229

* సెక్రటరీ జనరల్ సంఖ్య - 40

* ఎంపీలు - 11

* దౌత్యవేత్తలు - 8

* సహాయ అధికారులు - 96

* సమావేశం తర్వాత పర్యటనకు ఎంచుకున్న ప్రతినిధులు - 184

* అక్టోబర్ 2023లో జరిగిన 9వ జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (పీ20) భారత పార్లమెంటు చివరిగా నిర్వహించిన ఇంటర్-పార్లమెంటరీ సమావేశం.

* ఈ సమావేశాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.

* ఢిల్లీలోని ద్వారకలో ఉన్న 'యశోభూమి' ఈ సదస్సుకు వేదికగా నిలిచింది.

* ఈ పీ20 సదస్సులో 20 జీ20 సభ్య దేశాలతో పాటు 8 ఆహ్వానిత దేశాలు పాల్గొన్నాయి.  కానీ ప్రస్తుత సీఎస్‌పీఓసీలో 53 కామన్వెల్త్ దేశాలతో పాటు 14 స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్లు పాలుపంచుకోనున్నాయి. 

సీఎస్‌పీఓసీ సభ్యత్వ పార్లమెంట్‌లు 

ఆఫ్రికా ప్రాంతం

(18 దేశాలు)

* బోట్స్‌వానా 

* కామెరూన్

* ఘనా

* కెన్యా

* స్వాటిన్ కింగ్‌డమ్

* లెసోతో

* మలావి

* మారిషస్

* మొజాంబిక్యూ

* నమీబియా

* నైజీరియా

* రువాండా

* సీషెల్స్

* సియర్రా లియోన్

* దక్షిణాఫ్రికా

* టాంజానియా

* ఉగాండా

* జాంబియా

ఆసియా ప్రాంతం

(4 దేశాలు)

* బంగ్లాదేశ్

* మాల్దీవులు

* పాకిస్థాన్

* శ్రీలంక

ఆస్ట్రేలియా/న్యూజిలాండ్ ప్రాంతం

(2 దేశాలు)

* ఆస్ట్రేలియా

* న్యూజిలాండ్

బ్రిటిష్ దీవులు, మధ్యధరా ప్రాంతం

(3 దేశాలు)

* సైప్రస్

* మాల్టా

* యునైటెడ్ కింగ్‌డమ్

కెనడా ప్రాంతం

(1 దేశం)

* కెనడా

కరేబియన్, అమెరికా, అట్లాంటిక్ ప్రాంతం

(13 దేశాలు)

* యాంటిగ్వా - బార్బుడా

* బహామాస్

* బార్బడోస్

* బెలిజ్

* బెర్ముడా

* డొమినికా

* గ్రెనడా

* గయానా

* జమైకా

* సెయింట్ కిట్స్ - నెవిస్

* సెయింట్ లూసియా

* సెయింట్ విన్సెంట్ - గ్రెనడీన్స్

* ట్రినిడాడ్ - టొబాగో

పసిఫిక్ ప్రాంతం

(9 దేశాలు)

* ఫిజీ దీవులు

* కిరిబాటి

* నౌరు

* పపువా న్యూ గినియా

* సమోవా

* సోలమన్ దీవులు

* టోంగా

* తువాలు

* వనువాటు

ఆగ్నేయ ఆసియా ప్రాంతం

(2 దేశాలు)

* మలేషియా

* సింగపూర్

భారత ప్రాంతం

* భారతదేశం

 


(रिलीज़ आईडी: 2215000) आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Kannada , Urdu , हिन्दी , Odia , Malayalam