పార్లమెంటరీ వ్యవహారాలు
జవహర్‌లాల్ నవోదయ విద్యాలయాలకు నిర్వహించిన ‘26వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ 2024-2025’ పురస్కార ప్రదాన కార్యక్రమం
प्रविष्टि तिथि:
14 JAN 2026 12:23PM by PIB Hyderabad
జవహర్ నవోదయ విద్యాలయాల్ని దృష్టిలో పెట్టుకొని 2024-25 సంవత్సరానికి నిర్వహించిన 26వ జాతీయ యువజన పార్లమెంటు పోటీలో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని 2026 జనవరి 15న మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో రఫీ మార్గ్‌లో గల ఇండియా కాన్స్టిట్యూషన్ క్లబ్- మావలంకర్ సభా భవనంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రీ, న్యాయశాఖ సహాయ మంత్రీ (స్వతంత్ర) శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అధ్యక్షత వహిస్తారు. బహుమతులు గెలిచిన విద్యాలయాల విద్యార్థులకు పురస్కారాల్ని మంత్రి ప్రదానం చేస్తారు. ఈ పోటీల్లో అగ్ర స్థానంలో నిలిచిన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్-IIకు చెందిన ‘‘సూరత్‌గఢ్ పీఎమ్ శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ’’ విద్యార్థులు ‘యువజన పార్లమెంటు’ను మళ్లీ ప్రదర్శిస్తారు.
(रिलीज़ आईडी: 2214992)
आगंतुक पटल : 4