ప్రధాన మంత్రి కార్యాలయం
సైన్య దినోత్సవం సందర్భంగా సైనికుల ధైర్య సాహసాలకు నమస్కరించిన ప్రధానమంత్రి
సాయుధ బలగాల ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, కర్తవ్యనిష్ఠను ప్రశంసిస్తూ ఓ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
15 JAN 2026 8:55AM by PIB Hyderabad
ఈ రోజు సైన్య దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సైన్య అజేయ ధైర్య, సాహసాలకీ, దృఢ సంకల్పానికీ హృదయపూర్వకంగా నమస్కరించారు.
అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్ని రక్షిస్తున్న, నిస్వార్థ సేవలో సర్వోన్నత ఆదర్శాలను పరిరక్షిస్తున్న సైనికుల తిరుగులేని అంకితభావాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. ఓ సంస్కృత సుభాషితాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు.
భారతీయ సైన్యానికి ప్రధానమంత్రి నమస్కరించారు. జవాన్ల వీరత్వం, త్యాగాలకు గాను దేశం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ -
‘‘సైన్య దినోత్సవం సందర్భంగా, మనం భారతీయ సైన్య ధైర్య, సాహసాలకీ, దృఢ సంకల్పానికీ నమస్కరిద్దాం.
మన జవాన్లు నిస్వార్థ సేవకు ప్రతీక. వారు మొక్కవోని సంకల్పంతో, అప్పుడప్పుడూ కఠిన పరిస్థితుల్లో కూడా దేశ ప్రజలను కాపాడుతున్నారు. వారి అంకితభావం పూర్తి దేశంలో విశ్వాసాన్నీ, కృతజ్ఞతా భావననీ మేల్కొలుపుతున్నాయి.
కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తమ ప్రాణాలను అర్పించిన వారినందరినీ అత్యంత శ్రద్ధతో స్మరించుకొందాం’’.
‘‘దుర్గమ ప్రాంతాలు మొదలు మంచు కప్పేసిన పర్వత శిఖరాల వరకూ.. మన సైన్య శౌర్యం, పరాక్రమం దేశపౌరులు గర్వపడేటట్లు చేస్తున్నాయి. సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడంలో నిర్భయంగా నిలబడుతున్న జవాన్లకు హృదయపూర్వక అభినందనలు.
అస్మాకమింద్ర: సమృతేషు ధ్వజేష్వస్మాకం యా ఇషవస్తా జయన్తు
అస్మాకం వీరా ఉత్తరే భవన్త్వస్మాఁ ఉ దేవా అవతా హవేషు’’.
***
(रिलीज़ आईडी: 2214982)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam