ప్రధాన మంత్రి కార్యాలయం
సాంస్కృతిక బంధాల బలోపేతం.. ఒకే భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి పెంపులో కాశీ తమిళ సంగమం ప్రగతిపై తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
15 JAN 2026 9:36AM by PIB Hyderabad
కాశీ తమిళ సంగమం సాధించిన ప్రగతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనలను పొంగల్ పర్వదినం సందర్భంగా ప్రజలతో పంచుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే వైవిధ్య భారతంలో సంప్రదాయాలు, భాషలు, సమాజాలను ఏకం చేసే ఈ కార్యక్రమం సాంస్కృతిక ఆదానప్రదానానికి ఒక శక్తిమంతమైన వేదికగా మారిన తీరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
#సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా సోమనాథ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి, కాశీ, సౌరాష్ట్ర తమిళ సంగమం వంటి కార్యక్రమాలపై అక్కడి పౌరులను ప్రశంసిస్తూ వారితో ముచ్చటించారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వేర్వేరు భాషల్లో పంపిన సందేశాల్లో:
““#సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా సోమనాథ్‌ను సందర్శించినప్పుడు, పొంగల్ పర్వదినం సందర్భంగా కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం నిర్వహించిన ప్రశంసనీయ కార్యక్రమాలపై అక్కడి ప్రజలను నేను కలిశాను. కాశీ తమిళ సంగమం పురోగమనం, ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని అది బలోపేతం చేసిన తీరుపై నా ఆలోచనలను వారితో పంచుకున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2214980)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam