ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో భారతీయ భాషలపై మూడో అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్


భారతీమ ఉమ్మడి ధర్మాన్ని కాపాడుతున్న భాషా వైవిధ్యం: ఉపరాష్ట్రపతి

భారతదేశ భాషలు దేశాన్ని విభజించలేదు... ఐక్యం చేశాయి: ఉపరాష్ట్రపతి

భాషలను రక్షించడం అంటే నాగరికతను రక్షించడం: ఉపరాష్ట్రపతి

పార్లమెంటులో పెరుగుతున్న మాతృభాషల వాడకాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 09 JAN 2026 4:49PM by PIB Hyderabad

భారతీయ భాషలపై మూడో అంతర్జాతీయ సదస్సును న్యూఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ నేడు ప్రారంభించారుఈ సమావేశాన్ని వైశ్విక్ హిందీ పరివార్అంతర్జాతీయ సహకార పరిషత్ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రంఢిల్లీ విశ్వవిద్యాలయంలోని భారతీయ భాషా విభాగం నిర్వహించాయి.

పండితులుభాషావేత్తలుఅంతర్జాతీయ ప్రతినిధులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. భాషను నాగరికతకు మనస్సాక్షిగా అభివర్ణించారుఇది తరతరాలుగా సామూహిక స్మృతులనుజ్ఞాన వ్యవస్థలువిలువలను కలిగి ఉంటుందని అన్నారుప్రాచీన శిలాశాసనాలుతాళపత్ర గ్రంథాల నుంచి నేటి డిజిటల్ లిపిల వరకు..  మానవత్వాన్ని నిర్వచించే తత్వాలుశాస్త్రాలుకవిత్వంనైతిక సంప్రదాయాలను భాషలు సంరక్షిస్తున్నాయని ఆయన తెలిపారు.

చెన్నైలో ఇటీవల జరిగిన సిద్ధ దినోత్సవ వేడుకలలో తాను పాల్గొన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారుఅక్కడ భారతదేశపు విస్తారమైనబహుభాషా జ్ఞాన సంప్రదాయాలకు శాశ్వత సాక్ష్యంగా నిలిచే అనేక తాళపత్ర గ్రంథాలను చూసినట్లు చెప్పారు. ప్రతి భారతీయ భాష కూడా తత్వశాస్త్రంవైద్యంవిజ్ఞాన శాస్త్రంపరిపాలనఆధ్యాత్మికతకు ఎంతో కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు.

దేశంలోని అనేక భాషలు భారత్‌ను ఎప్పుడూ విభజించలేదని..  బదులుగా అవి ఒక ఉమ్మడి నాగరికత విలువలనుఉమ్మడి ధర్మాన్ని సంరక్షించి బలోపేతం చేశాయని ఉపరాష్ట్రపతి తెలిపారు.

రాజ్యసభ చైర్మన్‌గా తన తొలి పార్లమెంటు సమావేశాల అనుభవాన్ని పంచుకుంటూ.. ప్రస్తుతం అధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులు మాతృభాషల్లో ప్రసంగిస్తున్నారని ఉపరాష్ట్రపతి తెలిపారుభారత రాజ్యాంగ అనువాద ప్రతులను ఇటీవల భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సంతాలి భాషలో విడుదల చేశారనిఇది భాషా సమ్మిళితత్వానికిఅన్ని భాషలపై ప్రజాస్వామ్య గౌరవాన్ని ప్రతిబింబించే కీలక ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.

భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ భాషా వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించడం దేశ ప్రాచీన విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారుజాతీయ సమగ్రత ఏకరూపతపై కాకుండాపరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారుప్రతి పౌరుడు తన సొంత భాషలో భావాలను వ్యక్తపరచగలిగినప్పుడే ప్రజాస్వామ్యం వికసిస్తుందని అన్నారు.

సమకాలీన సవాళ్లను ప్రస్తావిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని ఉపరాష్ట్రపతి హెచ్చరించారుపరిశోధనలనుఅంతర్జాతీయ విద్యా సహకారాన్ని పెంపొందించడంలోప్రాచీన లిపులుతాళపత్ర గంథ్రాలను ముఖ్యంగా అంతరించిపోతున్న భాషలను సంరక్షించడంలో ఇలాటి భాషా సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. బహుభాషా విద్యను ప్రోత్సహించే జాతీయ విద్యా విధానం 2020ను ఉపరాష్ట్రపతి వివరించారుభారతీయ భాషల తాళపత్ర గ్రంథాలను సంరక్షించివ్యాప్తి చేస్తున్న జ్ఞాన భారతం మిషన్‌ను ఆయన అభినందించారుజ్ఞానం పవిత్రమైనదానిని అందరితో పంచుకోవాలనే భారతీయ నమ్మకాన్ని ఇది పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు.

భాషా సంరక్షణలో సాంకేతికత ఒక మిత్రుడిగా మారాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారుభారతీయ భాషలు వర్తమానంలో అభివృద్ధి చెందుతూభవిష్యత్తును తీర్చిదిద్దేలా డిజిటల్ ఆర్కైవ్‌లుకృత్రిమ మేధ ఆధారిత అనువాద సాధనాలుబహుభాషా వేదికలను ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

భాషలను సంరక్షించడం ద్వారా దేశం తన నాగరికతలను కాపాడుకుంటుందని ఉపరాష్ట్రపతి తెలిపారుభాషా వైవిధ్యాన్ని పెంపొందించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందనిప్రతి భాషను గౌరవించడం ద్వారా మానవత్వపు గౌరవాన్ని కాపాడుతుందని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో  కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ఇందిరాగాంధీ  జాతీయ కళా కేంద్రం చైర్మన్ శ్రీ రామ్ బహదూర్ రాయ్అంతర్జాతీయ సహకార మండలి సెక్రటరీ జనరల్ శ్రీ  శ్యామ్ పరాండేతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన పండితులువిద్యావేత్తలుభాషావేత్తలుపరిశోధకులు,  ప్రతినిధులు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2213068) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam