రైల్వే మంత్రిత్వ శాఖ
52 వారాల్లో 52 సంస్కరణలు: సమర్థత, పరిపాలన, సేవల అందజేతలో విస్తృత మెరుగుదలే లక్ష్యంగా భారతీయ రైల్వేల్లో ప్రధాన సంస్కరణలు
రైల్వేల్లో ప్రధాన సంస్కరణలకు జోరును అందించడానికి భద్రత, కృత్రిమ మేధ, సాంకేతికతలను ప్రోత్సహించడంపై శ్రద్ధ..
ప్రతిభకు పదును, శిక్షణకు మెరుగులు..
భోజన సేవల స్థాయిని పెంపొందించడంపైన ప్రత్యేక దృష్టి
प्रविष्टि तिथि:
08 JAN 2026 8:11PM by PIB Hyderabad
కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీలోని రైల్వే భవన్‌లో సహాయ మంత్రులు శ్రీ వి.సోమన్న, శ్రీ రవ్‌నీత్ సింగ్‌లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ శ్రీ సతీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
రైల్వేల రంగంలో ఈ ఏడాది 52 సంస్కరణలను ప్రవేశపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. నూతన సంవత్సరం, కొత్త సంకల్పాలు, రైల్వేల రంగంలో విస్తృత సంస్కరణలను తీసుకురావాలన్న భావనపై సమావేశంలో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు.
52 వారాల్లో 52 సంస్కరణలు - పనుల్లో, పాలనలో, సేవలను అందజేయడంలో సమర్ధతకు పెద్దపీట వేయాలని సంకల్పించారు.
భద్రతపై ప్రత్యేక శ్రద్ధ - 90 శాతం మేర తగ్గిన రైలు ప్రమాదాలు (వీటి సంఖ్య 2014-15లో 135గా ఉండగా, 2025-26లో 11కు పరిమితమయ్యాయి.) దీనిని ఒక అంకె స్థాయికి కుదించడం లక్ష్యం.
కృత్రిమ మేధకూ, సాంకేతికతకూ ఊతం - భద్రత, నిర్వహణ, కార్యకలాపాల్లో కృత్రిమ మేధనూ, ఉన్నత సాంకేతికతనూ ఉపయోగించుకోవడంపై దృష్టిని కేంద్రీకరిస్తారు.
ప్రతిభకు సాన, శిక్షణకు కొత్త రూపు - ఉద్యోగుల ప్రతిభకు సాన పెట్టడానికీ, నైపుణ్యాలను అభివృద్ధిపరచడానికీ కొత్త పద్ధతులను అన్వేషిస్తారు.
మెరుగైన ఆహారంతోపాటు సంబంధిత సేవలను అందజేయడం - ఆహార పదార్థాల నాణ్యతను, రైళ్లలో కేటరింగ్ సేవలను ఇప్పటి కన్నా చెప్పుకోదగ్గ స్థాయికి పెంచుతారు.
సహాయ మంత్రులు, చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఇతర ఉన్నతాధికారులు తమ క్షేత్రస్థాయి అనుభవాన్ని సమావేశంలో వివరించారు. సంస్థాగత అభివృద్ధి, నిర్వహణ అంశాలతో పాటు సామర్థ్యాన్ని పెంచే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలను సమీక్షించారు. సంస్కరణలు, భద్రత, సాంకేతిక పురోగతి, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపట్టే విషయాల్లో రైల్వే మంత్రిత్వ శాఖ నిబద్ధతను పునరుద్ఘాటించింది.
***
(रिलीज़ आईडी: 2212939)
आगंतुक पटल : 7