హోం మంత్రిత్వ శాఖ
జమ్మూకాశ్మీర్ భద్రతపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన సమీక్ష
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి, శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం
మోదీ ప్రభుత్వ నిరంతర, సమన్వయ ప్రయత్నాల ఫలితంగా జమ్మూకాశ్మీర్‌లో బలహీనపడిన ఉగ్రవాద వ్యవస్థ
ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఉగ్రవాద నిధుల సమీకరణను లక్ష్యంగా నిర్వహించే ఉగ్రవాద వ్యతిరేక (సీటీ) కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యతతో కొనసాగాలి
జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను బలోపేతం చేయడంలో భద్రతా బలగాల కృషిని ప్రశంసించిన కేంద్ర హోం మంత్రి
प्रविष्टि तिथि:
08 JAN 2026 9:16PM by PIB Hyderabad
జమ్మూకాశ్మీర్ భద్రతపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన నేడు న్యూఢిల్లీలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, జమ్మూకాశ్మీర్ ప్రదాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ పోలీస్, సీఆపీఎఫ్ అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జమ్మూకాశ్మీర్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని, దానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన నిరంతర, సమన్వయ ప్రయత్నాల ఫలితంగా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని శ్రీ షా అన్నారు.
జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను మరింత బలోపేతం చేయడంలో భద్రతా సంస్థలు చేస్తున్న కృషిని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఉగ్రవాద నిధుల సమీకరణను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద వ్యతిరేక (సీటీ) కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యతతో నిరంతరాయంగా కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2212918)
आगंतुक पटल : 6