రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవాలు-2026: వీర్ గాథ 5.0లో రికార్డు స్థాయిలో పాల్గొన్న 1.92 కోట్ల మంది విద్యార్థులు


తొలిసారిగా, 18 దేశాల్లో సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్న 91 పాఠశాలల నుంచి పాల్గొన్న 28,000 మందికి పైగా విద్యార్థులు

కర్తవ్యపథ్‌లో జరిగే కవాతులో ప్రత్యేక అతిథులుగా పాల్గొనేందుకు జాతీయ స్థాయిలో 100 మంది సూపర్ విజేతల ఎంపిక

प्रविष्टि तिथि: 08 JAN 2026 3:51PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖవిద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్ట్ వీర గాథ 5.0కు విశేష స్పందన లభించిందిఈ ఏడాది దాదాపు 1.90 లక్షల పాఠశాలల నుంచి సుమారుగా 1.92 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2021లో ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నారుజాతీయస్థాయిలో 100 మంది విజేతలుగా ఎంపికయ్యారుప్రాథమిక దశ (3 నుంచి గ్రేడ్లునుంచి 25 మందిమాధ్యమిక దశ (6 నుంచి గ్రేడ్లునుంచి 25 మందిసెకండరీ స్థాయి (9 నుంచి 10, 11 నుంచి 12 గ్రేడ్ల వరకు సమాన ప్రాతినిధ్యంనుంచి 50 మంది విజేతలుగా నిలిచారుసూపర్-100 విజేతల వివరాలు దిగువ లింక్‌లో ఉన్నాయి.

(వీర్ గాథ 5.0 – సూపర్-100 విజేతలు)

విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమాలను వీర్ గాథ 5.0 ప్రారంభించిందిఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్ 8న ప్రారంభమైందివీడియోగ్రఫీయాంకరింగ్రిపోర్టింగ్స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో మొదటిసారి షార్ట్-వీడియో విధానాన్ని ప్రవేశపెట్టారుఇది భారతీయ సైనిక సంప్రదాయాలువ్యూహాలుకార్యక్రమాలువీరోచిత గాథలతో సహా సమర పరంపరకు సంబంధించిన వీడియోలను రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహించింది.

కళింగ రాజు ఖారవేలపృథ్వీ రాజ్ చౌహాన్ఛత్రపతి శివాజీ మహారాజ్, 1857 యుద్ధ వీరులుగిరిజన తిరుగుబాటు వీరులతో సహా దేశంలోని గొప్ప యోధుల అజేయ స్ఫూర్తినిసైనిక వ్యూహాల గురించి అధ్యయనం చేసేలా విద్యార్థులను ప్రోత్సహించారుఈ వైవిధ్యమైన అంశాల ఎంపిక పోటీలకు వచ్చిన ఎంట్రీల నాణ్యతను పెంపొందించిందిఅలాగే భారత చారిత్రకసాంస్కృతిక వారసత్వంపై అవగాహనను పెంచింది.

విదేశాల్లో ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు మొదటిసారి ఈ పోటీల్లో పాల్గొన్నాయి. 18 దేశాల్లో ఉన్న 91 పాఠశాలలకు చెందిన 28,005 మంది విద్యార్థులు తమ ఎంట్రీలను సమర్పించారుభారత దేశ పరాక్రమాన్నిజాతీయ స్ఫూర్తి గాథలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయడంలోఈ కార్యక్రమ పరిధిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో సాధించిన ముఖ్యమైన విజయాన్ని ఇది సూచిస్తుంది.

ప్రాంతీయ స్థాయి కార్యక్రమాలను పాఠశాలల నిర్వహించగాుజాతీయ స్థాయి చర్చలను శౌర్య పురస్కార గ్రహీతలు (ఆఫ్‌లైన్ఆన్లైన్ రెండింటిలోచేపట్టారుమైగవ్ పోర్టల్ ద్వారా ఉత్తమ ఎంట్రీలను సమర్పించారు. 2025 నవంబర్ 10న పాఠశాల స్థాయి పోటీలు పూర్తయ్యాయిరాష్ట్రజిల్లా స్థాయుల్లో మూల్యాంకనం పూర్తయిన అనంతరం దాదాపు 4,020 ఎంట్రీలు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాయివాటిలో 100 ఉత్తమ ఎంట్రీలను సూపర్ - 100 విజేతలుగా ఎంపిక చేశారుగెలుపొందిన వారిని రక్షణ మంత్రిత్వ శాఖవిద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా న్యూఢిల్లీలో సత్కరిస్తాయిప్రతి విజేతకు రూ.10,000 నగదు బహుమతితో పాటు విశిష్ట అతిథులుగా కర్తవ్యపథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవాలు-2026ను వీక్షించే అవకాశం లభిస్తుంది.

ఈ వంద మంది విజేతలతో పాటుగా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో మందిని (ప్రతి విభాగం నుంచి ఇద్దరు చొప్పున), జిల్లా స్థాయిలో నలుగురిని (విభాగానికి ఒకరు చొప్పునఎంపిక చేసి రాష్ట్ర/కేంద్రపాలిత/జిల్లా అధికారులు సత్కరిస్తారు.

75 ఏళ్ల స్వాతంత్ర్యానికి  గుర్తుగా నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రాజెక్ట్ వీర్ గాథ కార్యక్రమాన్ని 2021లో ప్రారంభించారుశౌర్య పురస్కార గ్రహీతలు చేసిన సాహసాలువారి జీవిత కథల గురించి అవగాహన కల్పించడమే ప్రధానోద్దేశంగా ఈ కార్యక్రమం ప్రారంభమైందివిద్యార్థుల్లో దేశభక్తిపౌర విలువలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందిమొదటి విడత నుంచి అయిదో విడత వరకు ప్రాజెక్టు వీర గాథ స్ఫూర్తిదాయక ఉద్యమంగా మారిందివిదేశాల్లో ఉన్న భారతీయ పాఠశాలలకు కూడా చేరుకుంది.
ప్రాజెక్టు వీర్ గాథ ప్రారంభమైన నాటి నుంచి గణనీయమైన వృద్ధిని సాధించిందిమొదటి రెండు సంచికల్లో 25 మంది చొప్పున జాతీయ విజేతలను ఎంపిక చేశారుమొదటి సంచికలో సుమారు లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా రెండో సంచికలో దాదాపు 19 లక్షల మంది పాల్గొన్నారుమూడో సంచికలో 100 మంది జాతీయ విజేతలను ఎంపిక చేయగా 1.36 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్నారువీర్ గాథ 4.0 నాటికి ఈ సంఖ్య 1.76 కోట్లకు చేరుకుంది.

 

***


(रिलीज़ आईडी: 2212669) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Tamil , Malayalam