కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరులో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) ఆధ్వర్యంలో “నివేశక్ శిబిరం”

प्रविष्टि तिथि: 06 JAN 2026 12:48PM by PIB Hyderabad

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ), భారత సెక్యూరిటీస్ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ), మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎంఐఐఎస్)తో కలిసి 2026 జనవరి 3న బెంగళూరులో “నివేశక్ శిబిరం” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందిఈ కార్యక్రమం కర్ణాటక బెంగళూరులోని యశ్వంత్‌పూర్ గోపాల్ థియేటర్ సమీపంలో ఉన్న  శ్రీ వైమునిస్వామప్ప కళ్యాణ మండపం 17 వద్ద జరిగిందిపెట్టుబడిదారులు తమకు సంబంధించిన క్లెయిమ్ చేయని డివిడెండ్లుషేర్లుపెండింగ్‌లో ఉన్న ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు సమగ్ర వేదికగా ఈ శిబిరం నిలిచింది.

ఈ ఒక్కరోజు శిబిరానికి కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిదిఫిర్యాదుల పరిష్కారంక్లెయిమ్‌ల సదుపాయంపెట్టుబడిదారుల సేవల సహాయానికి ఒకే చోట పరిష్కార వేదికగా నిలిచిందిఈ కార్యక్రమంలో ఐఈపీఎఫ్ఏసెబీఎంఐఐలురిజిస్ట్రార్లుట్రాన్స్‌ఫర్ ఏజెంట్ల (ఆర్‌టీఏలునుంచి ఉన్నతాధికారులు పాల్గొన్నారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఈపీఎఫ్ఏ సీఈఓకార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త సెక్రటరీ శ్రీమతి అనితా షా అకెల్లాసెబీ చీఫ్ జనర్ మేనేజర్ శ్రీ కృష్ణానంద్ రాఘవన్సెబీ జనరల్ మేనేజర్ శ్రీ వినోద్ శర్మఐఈపీఎఫ్ఏ జనరల్ మేనేజర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదిత్య సిన్హాసీడీఎస్ఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సీఎస్ హరీషా,  బీఎస్ఈ ప్రతినిధి శ్రీ వినయ్ కుమార్ తోపాటు సెబీఐఈపీఎఫ్ఏఎంఐఐఆర్ టీఏకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

 

పెట్టుబడిదారుల్లో అవగాహనను పెంపొందించిక్లెయిమ్‌లను సులభంగావేగంగా పరిష్కరించేందుకు “ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్స్పెట్టుబడిదారుల సేవలకు పూర్తి మార్గదర్శి’’ పేరుతో ఓ వివరణాత్మక పుస్తకాన్ని ఐఈపీఎఫ్ఏ ఈ సందర్భంగా విడుదల చేసింది.

బెంగళూరుసమీప ప్రాంతాల నుంచి 900కు పైగా పెట్టుబడిదారులుక్లెయిమ్‌దారులు ఈ శిబిరంలో పాల్గొన్నారుప్రత్యక్ష సౌకర్యంఅక్కడికక్కడే సహాయం అందించడం ద్వారా పెట్టుబడిదారుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ శిబిరం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.

పుణేహైదరాబాద్జైపూర్అమృత్‌సర్‌లలో విజయవంతంగా నిర్వహించిన తర్వాత పెట్టుబడిదారులే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన తదుపరి నగరంగా బెంగళూరు నిలిచిందిదేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అనుకూలంగాపారదర్శకంగా సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఐఈపీఎఫ్ఏ నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది.

నివేశక్ శిబిరం ద్వారా ఆరు నుంచి ఏడు సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్ చేయని డివిడెండ్‌లుషేర్లను ప్రత్యక్షంగా సులభతరం చేసిందిఅలాగే అక్కడికక్కడే కేవైసీనామినేషన్  అప్‌డేట్లను పూర్తి చేయడంతోపాటుపెండింగ్‌లో ఉన్న ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్ సమస్యలను పరిష్కరించిందిపెట్టుబడిదారులు నేరుగా అధికారులను సంప్రదించేందుకుమధ్యవర్తులను తొలగిచేందుకు వాటాదారుల సంస్థలుఆర్ టీఏలు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశాయి.

కంపెనీ ప్రతినిధులుఆర్ టీఏలు,  ఐఈపీఎఫ్ఏసెబీ అధికారులతో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా వందలాది మంది లబ్ధి పొందారుసాధారణంగా నెలలు పట్టే ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగంగాపారదర్శకంగాసమర్థవంతంగా అందించిన ఈ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రశంసలు లభించాయి.

దేశ వ్యాప్తంగా క్లెయిమ్ చేయని పెట్టుబడులు అధికంగా ఉన్న నగరాలను కేంద్రంగా చేసుకుని ఐఈపీఎఫ్ఏ చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరులో నివేశక్ శిబిరాన్ని నిర్వహించారుఈ శిబిరాలు పెట్టుబడిదారుల్లో అవగాహనను పెంపొందించడంవారి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడందేశ ఆర్థిక వ్యవస్థలో నమ్మకంపారదర్శకతను బలోపేతం చేయడంలో ఐఈపీఎఫ్ఏ చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనం.

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ).. నిరంతర ప్రచార కార్యక్రమాలువిద్యవ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా పెట్టుబడిదారుల అవగాహనరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2211932) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Tamil , Kannada