ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫరీద్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీ శ్యామ్ బిహారీ లాల్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 02 JAN 2026 6:42PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని ఫరీద్‌పూర్ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ శ్యామ్ బిహారీ లాల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

“ఉత్తరప్రదేశ్‌లోని ఫరీద్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీ శ్యామ్ బిహారి లాల్జ్ మృతి వార్త నన్ను తీవ్రంగా బాధించింది. ఆయన అంకితభావంతో, కష్టపడి పనిచేసే బీజేపీ నాయకుడు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!’’

 

***


(रिलीज़ आईडी: 2211478) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam