ప్రధాన మంత్రి కార్యాలయం
సృజనాత్మకత, సుస్థిరత, సమాజ స్ఫూర్తికి ప్రతీకగా అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన: ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
02 JAN 2026 3:45PM by PIB Hyderabad
సృజనాత్మకత, సుస్థిరత, సమాజ భాగస్వామ్యాన్ని ఒకచోట చేర్చడంలో అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన విశేషమైన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ప్రదర్శన నగరం ఉత్సాహభరితమైన స్ఫూర్తిని, ప్రకృతిపై శాశ్వత ప్రేమను అందంగా ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు.
పుష్ప ప్రదర్శన ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. గత కొన్ని సంత్సరాలుగా ఇది విస్తృత స్థాయిలో, ఊహకు అందని రీతిలో అభివృద్ధి చెందిన విధానాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అహ్మదాబాద్ సాంస్కృతిక వైభవానికి, పర్యావరణ స్పృహకు ప్రతీకగా మారిందని పేర్కొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టుకు స్పందిస్తూ శ్రీ నరేంద్రమోదీ ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన సృజనాత్మకత, స్థిరత్వం, సమాజ భాగస్వామ్యాన్ని ఒకే చోట చేర్చడమే కాకుండా.. నగరంలోని ఉత్సాహభరిత స్ఫూర్తిని, ప్రకృతిపై ఉన్న ప్రేమను అందంగా చాటిచెబుతోంది. ఈ పుష్ప ప్రదర్శన సంవత్సరాలుగా తన పరిధి, ఊహాశక్తిలోనూ ఎంతగానో అభివృద్ధి చెందడం ప్రశంసనీయం.’’
(रिलीज़ आईडी: 2210846)
आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam