ప్రధాన మంత్రి కార్యాలయం
మన్నథు పద్మనాభన్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 JAN 2026 9:40AM by PIB Hyderabad
మన్నథు పద్మనాభన్ జయంతి ఈ రోజు. సామాజిక సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్మరించుకొంటూ, ఆయనకు నివాళులు అర్పించారు.
మన్నథు పద్మనాభన్ ఒక దార్శనికుడు. ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక సంస్కరణలోనే సిసలైన ప్రగతి వేళ్లూనుకొని ఉందని ఆయన నమ్మారని ప్రధానమంత్రి అన్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత వంటి రంగాలలో పద్మనాభన్‌వి మార్గదర్శక ప్రయత్నాలని ప్రధానమంత్రి ప్రస్తావించారు. పద్మనాభన్ కృషి దేశ ప్రజలకు గొప్ప స్ఫూర్తిని అందిస్తోందని కూడా ఆయన అన్నారు.
న్యాయపూర్ణ, కరుణామయ, సద్భావనపూర్వక సమాజాన్ని ఆవిష్కరించే దిశగా పయనించడంలో మనకు మన్నథు పద్మనాభన్ ఆదర్శాలు దారి చూపుతాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలు పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘మన్నథు పద్మనాభన్ జయంతి సందర్భంగా... మనం ఒక మహనీయుడిని ఎంతో ఆరాధనభావంతో స్మరించుకొంటున్నాం. ఆయన తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. ఆయన ఓ దార్శనికుడు.. నిజమైన ప్రగతి ఆత్మగౌరవంలో, సమానత్వంలో, సామాజిక సంస్కరణలో వేళ్లూనుకొని ఉందని ఆయన నమ్మారు. ఆరోగ్యం, విద్య, మహిళలకు సాధికారత కల్పన వంటి రంగాల్లో పద్మనాభన్ కృషి ఎంతో స్ఫూర్తిని అందిస్తోంది. ఆయన ఆదర్శాలు న్యాయపూర్ణ, కరుణామయ, సద్భావనపూర్వక సమాజాన్ని ఆవిష్కరించే దిశగా పయనించడంలో మనకు దారిని చూపుతూనే ఉంటాయి.’’
***
(रिलीज़ आईडी: 2210765)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam