కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వాయిస్ ఓవర్ వైఫై (వీఓడబ్ల్యూఐఎఫ్ఐ) సేవల్ని ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్
प्रविष्टि तिथि:
01 JAN 2026 12:18PM by PIB Hyderabad
కొత్త సంవత్సరం ఆరంభ వేళ.. వాయిస్ ఓవర్ వైఫై (వీఓడబ్ల్యూఐఎఫ్ఐ) సేవలను దేశమంతటా అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు సంతోషంగా ఉందని భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్) తెలిపింది. ఈ సేవలు ‘వై-ఫై కాలింగ్’గా పిలిచే ఈ సేవ ఇక దేశంలో అన్ని టెలికం సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు లభ్యమవుతుంది. దీంతో, సవాళ్లు ఎదురయ్యే ప్రాంతాల్లో కూడా అధిక నాణ్యత కలిగిన సంధాన సదుపాయాన్ని నిరంతరం అందుకోవడం సాధ్యపడుతుంది.
ఈ సేవ ఇక దేశంలోని టెలికం సర్కిళ్లన్నింటిలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు ఒక వై-ఫై నెట్‌వర్క్‌లో వాయిస్ కాల్స్ చేయడానికీ, అలాంటి కాల్స్ అందుకోవడానికీ, సంక్షిప్త సమాచారాన్ని పంపించడానికి కూడా వీఓడబ్ల్యూఐఎఫ్ఐ అనుకూలతను కల్పిస్తుంది. ఇది ఇళ్లు, ఆఫీసులు, బేస్‌మెంట్లు, సుదూర ప్రదేశాల వంటి మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉండే ప్రాంతాల్లో కూడా స్పష్టమైన, నమ్మదగ్గ సంధానాన్ని సమకూరుస్తుంది.
వీఓడబ్ల్యూఐఎఫ్ఐ అనేది ఐఎంఎస్ ఆధారిత సేవ. ఇది వై-ఫైకీ, మొబైల్ నెట్‌వర్కులకీ మధ్య ఎలాంటి ఇబ్బందులనూ ఎదుర్కోకుండానే మార్పిళ్లకు అనువుగా ఉంటుంది. థర్డ్ పార్టీ సేవల్ని పొందాల్సిన అవసరం లేకుండా కస్టమరు ఇప్పటి మొబైల్ నంబరునూ, ఫోన్ డయలరునూ ఉపయోగించుకొంటూ కాల్స్ చేయొచ్చు.
ఈ సేవ ముఖ్యంగా మొబైల్ సేవల లభ్యత పరిమితంగా మాత్రమే ఉండే ఏవైనా గ్రామీణ, దూరస్థ ప్రాంతాలకు మరింత ప్రయోజనకరం. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ అయినా, లేదా ఇతర బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులైనా ఓ స్థిర వై-ఫై కనెక్షనంటూ మాత్రం ఉండి తీరాలి. నెట్‌వర్క్ లో రద్దీని తగ్గించడానికి వీఓడబ్ల్యూఐఎఫ్ఐ సాయపడుతుంది. దీనిని ఉచితంగా అందిస్తారు.. వై-ఫై కాల్స్‌కు ఎలాంటి అదనపు ఖర్చులంటూ ఉండవు.
వీఓడబ్ల్యూఐఎఫ్ఐని ప్రవేశపెట్టడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఆధునికీకరణ కార్యక్రమంలో ఓ ముఖ్య చర్యను చేపట్టినట్లయింది. దేశం నలుమూలలా సంధానాన్ని మెరుగుపరచడంలో, మరీ ముఖ్యంగా ఆ తరహా సేవలు అంతగా చేరుకోనటువంటి ప్రాంతాలకూ సంధానాన్ని కల్పించాలనే బీఎస్ఎన్ఎల్ నిబద్ధతను ఈ చర్య బలపరుస్తోంది.
అత్యంత ఆధునిక స్మార్ట్‌ఫోన్లలో కూడా వీఓడబ్ల్యూఐఎఫ్ఐ సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు వారి హ్యాండ్‌సెట్ సెట్టింగ్స్‌లో వై-ఫై కాలింగ్ సౌకర్యం పనిచేసేటట్లు చూసుకొంటే చాలు. డివైస్ కంపాటిబులిటీ, సహాయం కోసం కస్టమర్లు అతి దగ్గర్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారు సేవాకేంద్రానికి వెళ్లాలి.. లేకపోతే బీఎస్ఎన్ఎల్ హెల్ప్‌లైన్ 18001503ని సంప్రదించవచ్చు.
***
(रिलीज़ आईडी: 2210453)
आगंतुक पटल : 10