ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్


374 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌‌.. రూ. 19,142 కోట్ల వ్యయంతో బీఓటీ పద్ధతిలో నిర్మాణం

प्रविष्टि तिथि: 31 DEC 2025 3:06PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్-కంట్రోల్డ్ రహదారిని నిర్మించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 374 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌ను రూ. 19,142 కోట్ల మూలధన వ్యయంతో బీఓటీ పద్ధతిలో నిర్మించనున్నారు. మ్యాప్‌లో చూపించినట్లుగా కర్నూలును అనుసంధానించే ఈ ప్రాజెక్టు.. నాసిక్, అహల్యానగర్, సోలాపూర్ వంటి ముఖ్యమైన ప్రాంతీయ నగరాలకు అనుసంధానతను అందిస్తుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ సూత్రం ప్రకారం సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేసే విషయంలో ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన పురోగతిగా ఉంది. 

పంగ్రిలో (నాసిక్ సమీపంలో) సమృద్ధి మహామర్గ్‌, నాసిక్‌లో ఎన్‌హెచ్-60 (ఆడేగావ్) జంక్షన్ వద్ద ఆగ్రా-ముంబయి కారిడార్‌తో, వధావన్ పోర్ట్ ఇంటర్‌చేంజ్ సమీపంలో ఢిల్లీ-ముంబయి‌ ఎక్స్‌ప్రెస్‌వేతో ఈ నాసిక్- అక్కల్‌కోట్ కారిడార్ అనుసంధానమౌతుంది. పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు ఉండే ఈ ప్రతిపాదిత కారిడార్ నిరంతర అనుసంధానతను అందిస్తుంది. చెన్నై పోర్ట్ వైపు నుంచి కర్నూలు, కడప, రేణిగుంట, తిరువళ్లూరు మీదుగా హసాపూర్ (మహారాష్ట్ర సరిహద్దు) వరకు ఉండే నాలుగు వరుసల కారిడార్ల (700 కి.మీ పొడవు) నిర్మాణం ఇప్పటికే కొనసాగుతోంది. ప్రయాణ దూరాన్ని 201 కిలోమీటర్లు, ప్రయాణ సమయాన్ని 17 గంటల మేర తగ్గించడంతో పాటు  ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరచాలన్న ప్రాథమిక లక్ష్యంతో ఈ ప్రతిపాదిత ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ఓర్వకల్, కొప్పర్తి వంటి ప్రధాన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) కేంద్రాల వద్ద సరకు రవాణా విషయంలో సామర్థ్యాన్ని ఈ నాసిక్ - అక్కల్‌కోట్ (సోలాపూర్) అనుసంధానత మెరుగుపరుస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిపాదిత కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఎన్ఐసీడీసీ గుర్తించిన పుణె-నాసిక్ ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణ అవసరాన్ని కూడా నాసిక్ - తలేగావ్ దిఘే విభాగం తీరుస్తుంది. ప్రయాణ సమయం, రద్దీ, నిర్వహణ ఖర్చులను తగ్గిస్తూ మెరుగైన భద్రత, అంతరాయం లేని ట్రాఫిక్ కోసం ఈ హై-స్పీడ్ కారిడార్‌ను రూపొందించారు. ముఖ్యంగా సోలాపూర్, ధారాశివ్, అహల్యానగర్, నాసిక్ జిల్లాల సమగ్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ ఈ ప్రాంతంలోని ప్రాథమిక మౌలిక సదుపాయాలను ఈ ప్రాజెక్టు మెరుగుపరుస్తుంది.

గంటకు 100 కి.మీ.ల డిజైన్ వేగం, గంటకు 60 కి.మీ.ల సగటు వేగంతో వాహనాలు నడిచేలా క్లోజ్డ్ టోలింగ్ సౌకర్యంతో కూడిన ఈ 6-వరుసల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ రూపొందించారు. సరకు రవాణా, ప్రయాణికుల వాహనాలకు వేగవంతమైన, సురక్షితమైన, అంతరాయం లేని అనుసంధానతను అందిస్తూనే మొత్తం ప్రయాణ సమయాన్ని సుమారు 17 గంటలకు (31 గంటల్లో 45 శాతం తగ్గింపు) ఇది తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టు సుమారు 313.83 లక్షల పనిదినాల పరోక్ష ఉపాధి, 251.06 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధిని సృష్టిస్తుంది. ఈ కారిడార్ పరిసరాల్లో పెరిగే ఆర్థిక కార్యకలాపాల కారణంగా ఈ ప్రాజెక్టు అదనపు ఉపాధి అవకాశాలను కూడా ప్రేరేపిస్తుంది.

నాసిక్-అహ్మద్‌నగర్-సోలాపూర్-అక్కల్‌కోట్ ప్రాజెక్ట్ మ్యాప్

 

***


(रिलीज़ आईडी: 2210277) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam