ప్రధాన మంత్రి కార్యాలయం
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ రెండో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
31 DEC 2025 1:51PM by PIB Hyderabad
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగి రెండేళ్లు పూర్తయిన శుభ సందర్భంగా దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్షికోత్సవాన్ని భారతీయ విశ్వాసానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే దివ్య ఉత్సవంగా ప్రధాని శ్రీ మోదీ అభివర్ణించారు. స్వదేశీ, విదేశీ భక్తులందరి తరపున శ్రీరాముని పాదాలకు వినమ్ర నమస్కారాలను అర్పిస్తూ.. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
శతాబ్దాల నాటి సంకల్పం సాకారమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ.. శ్రీరాముని అనుగ్రహం, ఆశీస్సులతో అయిదు శతాబ్దాలుగా కోట్లాది భక్తుల పవిత్ర కల సాకారమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రామ్ లల్లా తన దివ్యమైన ఆలయంలో మళ్లీ కొలువుదీరారని అన్నారు. ఈ ఏడాది అయోధ్యలో ధర్మధ్వజానికి, రామ్ లల్లా ప్రతిష్ఠ ద్వాదశి వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. గత నెలలో ఈ ధర్మధ్వజాన్ని ప్రతిష్ఠించే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.
మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని స్పూర్తితో ప్రతి పౌరుని హృదయంలో సేవా, అంకితభావం, కరుణ వంటి గుణాలు పెంపొందాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ విలువలే సంపన్నమైన, ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి పునాదులని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘అయోధ్య పవిత్ర భూమిపై నేడు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ వార్షికోత్సవం మన విశ్వాసం, విలువలకు ఒక దివ్యమైన వేడుక. ఈ పవిత్ర సందర్భంలో దేశ, విదేశాల్లోని రామ భక్తులందరి తరపున శ్రీరాముడి పాదాలకు నా కోటి నమస్కారాలు, వందనాలు. దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
"శ్రీరాముని అపరిమితమైన కృప, ఆశీర్వాదాలతో కోట్లాదిమంది రామ భక్తుల ఐదు శతాబ్దాల నాటి సంకల్పం నెరవేరింది. నేడు రామ్ లల్లా తన వైభవోపేతమైన ఆలయంలో తిరిగి కొలువుదీరారు. ఈ సంవత్సరం, అయోధ్య ధర్మ ధ్వజం, రామ్ లల్లా ప్రతిష్ట ద్వాదశికి సాక్ష్యంగా నిలుస్తోంది. గత నెలలో ఈ ధ్వజాన్ని ప్రతిష్ఠించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
పురుషోత్తముడైన శ్రీరాముని స్పూర్తి ప్రతి దేశవాసి హృదయంలో సేవ, అంకితభావం కరుణ వంటి భావాలను మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది సంపన్నమై, స్వావలంబన భారత్ ను నిర్మించేందుకు పునాదిగా నిలుస్తుంది.
జై శ్రీ రామ్!’’
(रिलीज़ आईडी: 2210265)
आगंतुक पटल : 4