ప్రధాన మంత్రి కార్యాలయం
సమాజ సంక్షేమం కోసం సద్భావనల శక్తిని సుభాషితం ద్వారా చెప్పిన ప్రధాని
प्रविष्टि तिथि:
31 DEC 2025 9:06AM by PIB Hyderabad
సమాజ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సద్భావన అత్యంత ప్రధానమైనదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఉన్నతమైన ఆలోచనలు, సానుకూల సంకల్పం ద్వారా మన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయన్నారు. వ్యక్తిగత నైతికత సమష్టి పురోగతికి దోహదపడుతుందన్న కాలాతీత సందేశాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
ప్రాచీన విజ్ఞానాన్ని ఉటంకిస్తూ.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“శుభప్రదమైన ఆలోచనలతోనే మనం సమాజానికి మేలు చేయగలం.
యథా యథా హి పురుషః కల్యాణే కురుతే మనః
తథా తథాస్య సర్వార్థః సిద్ధ్యంతే నాత్ర సంశయః”
***
(रिलीज़ आईडी: 2210086)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam