మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం-యువ 3.0 ఫలితాల ప్రకటన: ఇంగ్లీషుతో సహా 22 భారతీయ భాషల్లో 43 మంది యువ రచయితల ఎంపిక

प्रविष्टि तिथि: 30 DEC 2025 3:10PM by PIB Hyderabad

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బుక్ ట్రస్టుఇండియా అమలు చేసిన యువ రచయితలకు మార్గదర్శకత్వం అందించే ప్రధానమంత్రి పథకం (పీఎం-యువ 3.0) ఫలితాలు ఎన్‌బీటీ-ఇండియా వెబ్‌సైట్లో విడుదలయ్యాయిజాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020కు అనుగుణంగా.. తమ రచనలుఆలోచనలతో దేశ నిర్మాణానికి సహకారం అందించేలా యువ రచయితలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.

దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల ద్వారా 30 ఏళ్లు లోపు వయసున్న 43 మంది యువ రచయితల పుస్తక ప్రతిపాదనలను ఈ సంచికలో ఎంపిక చేశారుఇంగ్లీషుతో సహా 22 భారతీయ భాషల్లో ఈ పోటీలను నిర్వహించారుఅవి అస్సామీస్బెంగాలీబోడోడోగ్రీగుజరాతీహిందీకన్నడకశ్మీరీమలయాళంమణిపురిమరాఠీమైథిలీనేపాలీఒడియాపంజాబీసంస్కృతంసంతాలీసింధీతమిళంతెలుగుఉర్దూదేశవ్యాప్తంగా సమగ్ర సాహిత్యాభివృద్ధిని ప్రోత్సహించాలన్న ఈ పథకం లక్ష్యాన్ని ఈ విస్తృత భాషా భాగస్వామ్యం తెలియజేస్తుందిఎంపికైన 43 మంది రచయితల్లో 19 మంది మహిళలు, 24 మంది పురుషులు ఉన్నారు.

ఎంపిక చేసిన ప్రతిపాదనలను ప్రముఖ విద్యావేత్తల మార్గదర్శకత్వంలో ఆరు నెలల వ్యవధిలో పుస్తకాలుగా అభివృద్ధి చేయాలిఎంపికైన రచయితకు నెలకు రూ.50,000 చొప్పున ఉపకార వేతనం లభిస్తుందిప్రచురితమైన వారి పుస్తకానికి 10 శాతం జీవితకాలం రాయల్టీ లభిస్తుంది.

పీఎం-యువ 3.0 ఇతివృత్తాలుదేశ నిర్మాణానికి భారతీయ సంతతి అందిస్తున్న సహకారంభారతీయ విజ్ఞాన వ్యవస్థఆధునిక భారత నిర్మాతలు (1950-2025). చరిత్రసంస్కృతిసైన్సుఫిలాసఫీపాలనసామాజిక సంస్కరణఅంతర్జాతీయంగా భారత భాగస్వామ్యం ద్వారా దేశం గతాన్నిప్రస్తుతాన్నిభవిష్యత్తును ఈ నాన్-ఫిక్షన్ రచనలు ప్రతిబింబిస్తాయి.

త్వరలో నిర్వహించబోయే న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ (2026 జనవరి 10-18)లో ఎంపికైన రచయితలతో జాతీయ శిబిరాన్ని నిర్వహిస్తారుపీఎం-యువ 3.0 ద్వారా తొలిసారిగా రూపొందించే పుస్తకాలను వచ్చే ఏడాది ప్రచురిస్తారుదేశ విదేశాల్లో భారతీయ సాహిత్యానికిఆలోచనలకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త తరం రచయితలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.

 

***


(रिलीज़ आईडी: 2209835) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali-TR , Kannada