ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పిస్తూ.. సామర్థ్యం, న్యాయం, ఐక్యత గురించి తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 30 DEC 2025 10:10AM by PIB Hyderabad

అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 డిసెంబర్ 30న పోర్ట్‌బ్లెయిర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ఆకాంక్ష ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధించదనిసామర్థ్యంకృషిన్యాయంసమష్టి సంకల్పం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఈ చారిత్రక ఘట్టం గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి వివరించారు.

ఈ స్ఫూర్తిని తెలియజెప్పే సుభాషితాన్ని ప్రధానమంత్రి మోదీ ఎక్స్‌లో పంచుకున్నారు:

‘‘ఈ రోజు అంటే.. 1943 డిసెంబర్, 30న పోర్ట్ బ్లెయిర్లో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారుకేవలం ఆకాంక్షతో మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధించదనిసామర్థ్యంకఠోర శ్రమన్యాయంసమష్టి సంకల్పం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఈ సంఘటన మనకు తెలియజేస్తుందిఈ నాటి సుభాషితం కూడా ఇదే భావాన్ని తెలియజేస్తోంది.

సామర్థ్య మూలం స్వాతంత్ర్యం శ్రమ మూలం చ వైభవం|

న్యాయ మూలం సురాజ్యం.. సంఘ మూలం మహాబలం||’’

 

****


(रिलीज़ आईडी: 2209703) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada